Monday, January 20, 2025

2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఢిల్లీ గద్దె నుంచి దింపుతాం

- Advertisement -
- Advertisement -

ఏఐసిసి అగ్రనేత రాహుల్‌గాంధీ

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో బిజెపిని నామరూపాల్లేకుండా కాంగ్రెస్ పార్టీ చేసిందని, ఈ ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఏఐసిసి అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆంథోల్‌తో పాటు పలుచోట్ల జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్‌గాంధీ మాట్లాడుతూ 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఢిల్లీ గద్దె నుంచి దింపుతామన్నారు. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తనపైన 24 కేసులు పెట్టి, లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసి, అధికారిక బంగళా లేకుండా చేశారని మోడీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కట్టిన అనేక సాగునీటి ప్రాజెక్టులు ఇప్పటికీ ప్రజలకు ఫలాలు ఇస్తున్నాయని రాహుల్‌గాంధీ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News