Sunday, April 6, 2025

మేము ఆర్ఎస్ఎస్, బిజెపి కులగణన చేసేట్టు చూస్తాం: లాలూ ప్రసాద్ యాదవ్

- Advertisement -
- Advertisement -

పాట్నా:  కుల గణన అంశంపై బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంపై మంగళవారం ముందస్తు దాడిని ప్రారంభించిన ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్, కులగణన విషయంలో విపక్షం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కుల గణన నిర్వహించేలా చూస్తుందన్నారు.

సేకరించిన డేటాను రాజకీయాలకు కాకుండా నిరుపేదల సంక్షేమం కోసం ఉపయోగించేట్లయితే కుల గణనకు మద్దతిస్తామని ఆర్‌ఎస్‌ఎస్ చెప్పిన ఒక రోజు తర్వాత ఆయన ఈ వ్యాఖ్య చేశారు.

‘‘ఆర్‌ఎస్‌ఎస్‌ ,  బిజెపి కూర్చుని వినేలా చేస్తాం, కుల గణన చేయిస్తాం… కుల గణన చేయించకుండా  చూసే అధికారం వీళ్లకేం ఉంది? దళితులు, వెనుకబడినవారు, గిరిజనులు, పేదలు ఐక్యతను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది” అని లాలూ ప్రసాద్ హిందీలో పోస్ట్ పెట్టారు.

దేశవ్యాప్త కుల గణన , రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్‌లో బీహార్ ప్రభుత్వం కోటా పెంపును చేర్చాలని కోరుతూ ఆర్ జెడి సెప్టెంబర్ 1, ఆదివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా ఒకరోజు బైఠాయింపు నిర్వహించింది.

పాట్నాలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆర్ జెడి  నాయకుడు తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, కేంద్రంలో మరియు రాష్ట్రంలోని ఎన్ డిఏ  ప్రభుత్వం సమాజంలోని అణగారిన వర్గాలకు రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా , కుల జనాభా గణనకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News