Saturday, September 21, 2024

ఎపి విద్యుత్ బోర్డు మొండి వైఖరి

- Advertisement -
- Advertisement -

power department

 

అక్కడినుంచి వచ్చే ఉద్యోగులను అడ్డుకుంటాం
ఎపి అధికారుల గిల్లికజ్జాలు
అక్కడి ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు
ఒక్క ఆంధ్ర ఉద్యోగినీ ఇక్కడికి రానియ్యం : తెలంగాణ
ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్

మనతెలంగాణ/హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగుల విభజన సమస్య ఆరు సంవత్సరాలుగా రెండు రాష్ట్రాల మధ్య నలుగుతోందని, ఆంధ్ర విద్యుత్ యాజమాన్యాలు మొండిగా వ్యవహారిస్తున్నాయని శివాజీ, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అధ్యక్షుడు ఆరోపించారు. ఆదివారం మింట్ కాంపౌండ్‌లో ఎపి విద్యుత్ సంస్థలు రిలీవ్ చేసిన పత్రాలను తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ జేఏసి ఆధ్వర్యంలో తగుల బెట్టారు.

ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ సర్వీస్ రిజిస్ట్రర్‌లో హోమ్ డిస్ట్రిక్ ఉన్న వాళ్లను రిలీవ్ చేశారని, అన్యాయంగా తెలంగాణ ప్రభుత్వంతో ఎపి అధికారులు గిల్లికజ్జాలు పెట్టుకుంటుంన్నారన్నారు. ఎపి ప్రభుత్వానికి తెలియకుండా అక్కడి విద్యుత్ సంస్థలు నిర్ణయాలు తీసుకుంటున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎపిలోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను కించపరుస్తున్నారని, అక్కడ పనిచేసే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఆత్మగౌరవంతో పని చేయాలా వద్దా అని ఆయన ప్రశ్నించారు? నేటి నుంచి జిహెచ్‌ఎంసి పరిధిలో ఉదయం నుంచి విద్యుత్ సౌదాలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన వెల్లడించారు.

భోజన సమయంలో ఎపి రిలీవ్ చేసిన పత్రాలను కాల్చి వేసి, ఎపి ఉద్యోగులను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. రోజు వారి నిరసన ప్రదర్శనలు చేపడతామని, ఒక్క ఆంధ్ర ఉద్యోగిని కూడా తెలంగాణకు రానివ్వకుండా తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామన్నారు. తెలంగాణలో ఉద్యోగుల మధ్య శాంతియుత వాతావరణం చెడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ జేఏసి
ఎపి విద్యుత్ ఉద్యోగులు తెలంగాణలో జాయిన్ అయ్యేందుకు వస్తే కచ్చితంగా అడ్డుకుంటామని తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ జేఏసి నాయకులు ఆరోపించారు. తెలంగాణ విద్యుత్ సంస్థలు సామరస్యంగా సమస్య పరిష్కారం కోరుతూ వచ్చాయని, ఎపి విద్యుత్ సంస్థలు ఉద్యోగుల మధ్య చిచ్చు రేపుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆదివారం అత్యవసర సమావేశం
ఎపి విద్యుత్ సంస్థల ఏకపక్ష నిర్ణయంతో తెలంగాణ ఉద్యోగులు నష్టం వాటిల్లుతోందని రాష్ట్ర పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు ఆరోపించారు. ఎపి స్థానికత ఉద్యోగులను అక్కడి విద్యుత్ సంస్థలు రిలీవ్ చేయడంపై రాష్ట్ర పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆదివారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ఎపి ఉద్యోగులు ఇక్కడ ఉద్యోగాల్లో చేరడాన్ని అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.

నేటి నుంచి నల్లబ్యాడ్జీలు ధరించి తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు నిరసన తెలియచేయాలని నిర్ణయించినట్టుగా వారు పేర్కొన్నారు. అవసరమైతే ఈ కేసును సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామని వారు తెలిపారు. ఈ సమావేశంలో టిఎస్‌పిఈఏ అధ్యక్షుడు రత్నాకర్‌రావు, కార్యదర్శి సదానందం, కిరణ్‌కుమార్, శివశంకర్, వెంకట్ నారాయణరెడ్డి, విద్యాసాగర్, వెంకటేశ్వర్, గోపాల్‌రావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

We will prevent Employees from coming from AP
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News