- రాష్ట్ర ఆర్థిక , వైద్యారోగ్య శా ఖ మంత్రి హరీశ్‌రావు
సంగారెడ్డి: పార్టీ కార్యకర్తలను కం టికి రెప్పలా కాపాడుకుంటామని రాష్ట్ర ఆర్థిక , వైద్యారోగ్య శా ఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి మార్కెట్ కమిటీనూ తన పాలకవర్గ ప్రమాణ స్వీకారం సోమవారం సంగారెడ్డి సమీపంలోని గోకుల్ ఫంక్షన్ హాలులో జరిగింది. ఈ కార్యక్రమాని కి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ సిఎం కెసిఆర్ లేకుంటే సంగారెడ్డికి మెడికల్ కాలేజీ వచ్చేదేనా? అని అడిగారు. తెలంగాణ ఉద్యమంలో చాలా మంది పని చేశారని, వారందరికి సిఎం కెసిఆర్ తగిన గుర్తింపు ఇస్తున్నారని చెప్పారు. ఇంకా కొంత మందికి పదవు లు రావాల్సి ఉందన్నారు. కొత్త మార్కెట్ కమిటీ పాలక వర్గం బాగా పని చేయాలని, రైతులకు సేవ చేయాలని, కెసిఆర్ రై తుల కోసం అమలు చేస్తున్న పథకాలన్ని రైతులకు చేరేలా చూ డాలని మంత్రి సూచించారు.
ఎంపి కొత్త ప్రభకార్‌రెడ్డి మాట్లాడు తూ ఇక్కడ పార్టీలో ఎవరో చేరుతున్నారని కార్యకర్తలు నారాజ్ అవుతున్నారని, అలాంటి వారెవరూ పార్టీలోకి రాబోరని ఆయన పరోక్షంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డినుద్దేశించి వాఖ్యానించారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని సూచించారు. జిల్లా పార్టీ అ ధ్యక్షుడు, చింత ప్రభాకర్ మాట్లాడుతూ గత నాలుగున్నర ఏళ్లు గా కార్యకర్తలు ఎంతో అండగా ఉన్నారని, ఇపుపడు తనకు ఆరోగ్యం బాగా లేకున్నా పార్టీని వారే కాపాడుకుంటున్నారని చెప్పారు. సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్‌రావు సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయనన్నారు. కార్యకర్తలకు అనేక పదవులు వచ్చాయని, ఇంకా వస్తాయని వివరించారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని కోరారు. డిసిసిబి వైస్ చైర్మన్ మాణిక్యం మాట్లాడుతూ సిఎం కెసిఆర్, జిల్లా మంత్రి హరీశ్‌రావుల సహకారంతో అనేక పథకాలు అమలవుతున్నాయని వివరించారు. మార్కెట్ చైర్మన్ ప్రభుగౌడ్ మాట్లాడుతూ తనకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎంపి బిబి పాటిల్, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ భూపాల్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ శరత్, మున్సిపల్ చైర్‌పర్సన్ బొంగుల విజయలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, పార్టీ నేతలు విజేందర్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, డాక్టర్ శ్రీహరి, డాక్టర్ శ్రీహరి. నక్క నాగరాజు గౌడ్, వైస్ చైర్మన్ ఖాజా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.