Tuesday, December 24, 2024

బిఆర్‌ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: బిఆర్‌ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం అని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం నాంపల్లి మండలంలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన గన్నెబోయిన సైదులు లారీ డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తూ గత ఏడాది ఏపిలోని రాజమండ్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడికి బిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వం ఉండటంతో ప్రమాదభీమా కింద వచ్చిన 2లక్షల రూపాలయ చెక్కును సైదులు సతీమణి గన్నెబోయిన జ్యోతికి ఎమ్మె ల్యే అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వం ప్రతి ఒక్కరికీ ఉండాలని, ప్రమాదభీమా ఉండటంతో ఆపదలో కుటుంబానికి ఎంతో ఆసరాగా ఉంటుందని పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ భరోసా కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గుమ్మడపు నరసింహారావు, తుమ్మలపల్లి గ్రామ సర్పంచ్ బుష్పాక లీల నగేష్,నాయకులు పసునూరు మాజి సర్పంచ్ పోగుల వెంకట్‌రెడ్డి, మాల్ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ నడింపల్లి యాదయ్యగౌడ్, వడ్డేపల్లి మాజి సర్పంచ్ ఒట్టికోటి సుదాకర్, టిఆర్‌ఎస్, నాయకులు, కార్యకర్తలు ,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News