Monday, January 20, 2025

బిఆర్‌ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

- Advertisement -
- Advertisement -

నల్లగొండ:బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం నకిరేకల్ మున్సిపాలిటీ 5వ, 6వ వార్డుకు చెందిన 80మంది మహిళలు,వివిధ పార్టీల నాయకులు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు. వారికి గులాబి కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని చూసి బిఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. దేశంలో ఎక్కడా అమలు చేయని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు. సబ్బండ వర్గాలకు లబ్ధి చేకూరుస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. పాత,కొత్త అని తేడా లేకుండా కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి మూడవసారి బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలన్నారు.

పార్టీలో చేరిన వారిలో మాతంగి రజిత, గాదె సుశీల, నకిరేకంటి ప్రసన్న, సునిత, బొస్క రేణుక, తీగల లలిత, వంటెపాక వెంకటమ్మ, జిల్లా ప్రమీళ, వంటెపాక మారమ్మ, గాదె వెంకటేష్, వంటెపాక పుష్ఫ, రేణుక, ఎల్లమ్మ, మండలం పద్మ, గూడపురి సైదమ్మ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, బీఆర్‌ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు ప్రగడపు నవీన్‌రావు, యల్లపురెడ్డి సైదిరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News