Friday, January 10, 2025

ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం నిర్మించకపోతే ఆందోళన చేస్తాం

- Advertisement -
- Advertisement -

గోషామహల్: ఉస్మానియా ఆసుపత్రికి వెంటనే నూతన భవనాన్ని నిర్మించా లని ఉస్మానియా జేఏసీ ప్రతినిధి, జూనియర్ వైద్యులు డా క్టర్ పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ మే రకు బుధవారం ఉస్మానియా ఆసుపత్రి ఔట్ పేషంట్ బ్లాక్ వద్ద జేఏసీ ప్రతినిధులు రాజేష్, మనోహర్‌లతో కలిసి ఉస్మానియా ఆసుపత్రి నూతన భ వనం నిర్మించాలని డిమాండ్ చేస్తూ కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఉస్మానియా ఆసుపత్రి పాత భవన ం మూసి వేయడంతో స్థలాభావం కారణంగా రోగులకు పడకలు సర్దుబాటు చేయలేక ఇబ్బందులకు గురవుతున్నామని, రోగులను కింద పడుకోబెట్టి చికిత్సలు చేయాల్సిన దుస్థితి నెలకొందని, వారికి సకాలంలో వైద్యం అందించేందుకు వైద్యులతో పాటు సిబ్బంది కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతినిత్యం వైద్యం కోసం వేలాది మంది రోగులు వచ్చే ఉస్మానియా ఆసుపత్రి మౌలిక సదుపాయాలు సైతం కరువై సమస్యల నిలయంగా మారిందన్నారు. ఇంకా ఎన్నాళ్లిలా కనీస సదుపాయాలు లేని భవనాల్లో సమస్యలతో సహవాసం చేస్తూ వైద్యసేవలు అందించా లని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీష్‌రావు నూతన భవనం విషయమై వారం రోజుల్లోగా హైకోర్టుకు వెళ్తామ ని చెప్పి 15 రోజులు గడుస్తున్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు కనిపించడం లేదన్నారు. నూతన భవనం నిర్మించాలని గత పదేళ్లుగా జూనియర్ వైద్యులు నిరస నలు వ్యక్తం చేస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్షం చేస్తుందని ఆరోపించారు. ప్రతినిత్యం అనారోగ్యంతో ఆసుప త్రికి వచ్చే వేలాది మంది పేద రోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి, ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవన నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చే శారు. లేని పక్షంలో జేఏసీ పక్షాన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News