చర్లపల్లి ః ప్రజలకు దగ్గరలోనే మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అందులో భాగంగా వార్డు కార్యలయాల్లోనే అన్ని పౌర సేవలు అందిస్తున్నమని ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కాప్రా సర్కిల్ కార్యలయంలో అన్ని విభాగాల అధికారులతో ఎమ్మేల్యే వార్డుకార్యలయాల పాలనపై డిప్యూటి కమిషనర్ శంకర్‌తో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు సేవలు అందించేందుకు వార్డు కార్యలయంలో సిబ్బంది అందుబాటులో ఉండాలని సుచించారు. ప్రజలు దరాఖాస్తు చేసుకున్న వెంటనే సంభదిత అధికారులు ఫీల్డ్‌పై వెల్లి సమస్యలు పరిక్షరించాలని సుచించారు. ప్రతి వార్డు కార్యలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 05 గంటల వరకు అందుబాటులో ఉండాలని తెలిపారు. కంప్యూటర్ అపరేటర్‌తో పాటు అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఫీల్డ్‌పై వెల్లే అధికారులు సాయంత్రం 3 గంటల నుంచి సాయంత్ర 05 గంటల వరకు అందుబాటులో ఉంటారని ప్రజలు సద్వీనియోగం చేసుకోవాలని సుచించారు. ఈకార్యక్రమంలో జీహెచ్‌ఎంసి స్టాండింగ్ కమిటి సభ్యులు పన్నాల దేవేందర్‌రెడ్డి, వైద్యఅధికారి డాక్టర్ స్వప్నరెడ్డి, ఈఈ హరిలాల్, వాటర్ బోర్డ్ డిజీఎం సతీష్‌కుమార్, ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాస్, సిఐ ప్రవీన్‌కుమార్, డిఈ రవీందర్‌గౌడ్, ఏఎమ్‌సి షానవాజ్, జయరాజు, వార్డు కార్యలయ అధికారులు, ఇంజనీర్లు వివిద విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వార్డు కార్యాలయాల్లోనే ప్రజలకు అన్ని సేవలు అందిస్తాం
- Advertisement -
- Advertisement -
- Advertisement -