Monday, December 23, 2024

మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తాం : మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్ రామ్ గోపాల్‌పేట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అగ్ని ప్రమాదంలో కాలిపోయిన భవనాన్ని శనివారం అధికారులతో కలిసి మంత్రి సందర్శించారు. కాలిపోయిన భవన శిథిలాలను క్రేన్‌ సహాయంతో పరిశీలించారు.
అనంతరం ఆయన బస్తీవాసులతో మాట్లాడారు. రెండురోజుల క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో ఇంకా మంటలు చల్లారకపోవడంతో ఫైర్ అధికారులు ఫోమ్ తో స్ప్రే చేస్తున్నారని వెల్లడించారు. క్లూస్‌ టీమ్ తో పాటు జీహెచ్‌ఎంసీ, వివిధ శాఖల అధికారులు భవనాన్ని పరిశీలిస్తున్నారని తెలిపారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేనిపోని ఆరోపణలు చేయడం పద్దతి కాదని సూచించారు.

2008 లో బిల్డింగ్ రెగ్యులరైజ్ స్కీం ఆగిపోయిందని గుర్తు చేశారు. బిఆర్‌ఎస్‌ ద్వారా ఖజానా నింపుకుంటున్నారని కేంద్రమంత్రి మాట్లాడటం శోచనీయమని అన్నారు. కాలిపోయిన భవనం చుట్టూ ఉన్న ఇళ్ల వారికి పునరావాస కేంద్రం ఏర్పాటు చేశామని వివరించారు. భవనం కూల్చివేత సందర్భంలో బస్తీలో ఉన్న ఇళ్లకు నష్టం జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని పేర్కొన్నారు.

పక్క భవనాలకు నష్టం జరగకుండా కొత్త టెక్నాలజీతో భవనాన్ని కూల్చడానికి రెండురోజుల సమయం పడుతుందని స్పష్టం చేశారు.  ఈ నెల 25న ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News