Monday, December 23, 2024

నాణ్యమైన బతుకమ్మ చీరలను అందిస్తాం: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: గత ప్రభుత్వ అందించిన బతుమ్మ చీరల కంటే ఈ సంవత్సరం మరింత నాణ్యమైన చీరలను అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ, చేనేత, సహాకార, మార్కెటింగ్‌శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావువ అన్నారు.  వేముల వాడ ఎంఎల్‌ఏ ఆది శ్రీనివాస్, సిరిసిల్లా కాంగ్రేస్ ఇన్‌ఛార్జ్ కె.మహేందర్ రెడ్డి , హ్యాండ్లూమ్ టెక్స్‌టైల్స్ కార్యదరి ఆలుగు వర్షిణితో ఆయన శనివారం సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా వారు చేనేత కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం వారు సిరిసిల్ల చేనేత కార్మికుల సమస్యల గురించి బీసి వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రుల యూనిఫామ్స్, పోలీసు యూనిఫాంలను సిరిసిల్ల చేనేత సంస్థలకు కాంట్రాక్టు ఇచ్చినట్లయితే సంవత్సరమంతా కార్మికులకు పని లభించడంతో పాటు పరిశ్రమలు నష్టాలను అధిగమించి ఆర్థికంగా పురోగతి సాధిస్తాయన్నారు.కార్మికుల, పరిశ్రమల మనుగడను దృష్టిలో పెట్టుకొని ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని అమలు చేసే విధంగా కృషి చేయాలని వారు కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News