Wednesday, January 22, 2025

నీట్ స్కామ్ పై పార్లమెంటులో ప్రశ్నిస్తాం: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) లో జరిగిన అవకతవకలపై రాహుల్ గాంధీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంటులో విద్యార్థుల గళంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. ఇటీవల మెడికల్ కోర్సల కోసం నిర్వహించిన నీట్-యూజి పరీక్ష 2024లో 67 మందికి ప్రథమ ర్యాంకు రావడంపై స్పందిస్తూ పేపర్ లీకేజీ సమస్యల నుంచి విద్యార్థులకు విముక్తి కల్పిస్తామన్నారు. ఇందుకు కాంగ్రెస్ బలమైన ప్రణాళిక రూపొందించిందని ఎక్స్ లో ట్వీట్ చేశారు.

‘ ప్రధాని నరేంద్ర మోడీ ఇంకా ప్రమాణ స్వీకారం చేయక ముందే స్కామ్ కారణంగా 24 లక్షలకు పైగా విద్యార్థులు, వారి కుటుంబాలు నష్టపోయారన్నారు.

ఒకే పరీక్ష కేంద్రంలో ఆరుగురు విద్యార్థులు టాప్ స్కోర్ సాధించారు. అంతేకాక చాలా మంది విద్యార్థులు సాంకేతికంగా సాధ్యం కానీ అనూహ్య మార్కులు సాధించారని విమర్శించారు. పేపర్ లీకేజీ పై ప్రభుత్వం బుకాయిస్తోందని అన్నారు. చట్టం చేయడం ద్వారా లీక్ సమస్యల నుంచి విద్యార్థులకు విముక్తి కల్పిస్తామన్నారు. లోక్ సభలో విద్యార్థుల తరఫున గళం విప్పుతామన్నారు.

Rahul Gandhi

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News