Monday, December 23, 2024

ముస్లింలు లేని రాజ్యాంగాన్ని రాస్తాం: ప్రవీణ్ తొగాడియా (వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: హిందువుల ప్రయోజనలను మాత్రమే దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగాన్ని పునర్‌లిఖించాల్సిన అవసరం ఉందని అంతర్రాష్ట్రీయ హిందూ పరిషద్ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా అన్నారు. ఉత్తరాఖండ్‌లో ఒక బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తున్న వీడియో ఒకటి గురువారం వెలుగులోకి వచ్చింది. కొత్తగా రాసే రాజ్యాంగంలో ముస్లింలను చేర్చకూడదని కూడా ఆయన స్పష్టం చేశారు.

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని తిరగ రాస్తామని, ప్రభుత్వ పదవికి ముస్లింలు ఎవరూ అర్హులు కాకుండా చూస్తామని తొగాడియా అన్నారు. అంతేగాక దేశంలో జనాభా నియంత్రణకు ఒక చట్టం తీసుకురావలసిన అవసరం ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఇద్దరికి మించి పిల్లలున్నవారికి సబ్సిడీ బియ్యం, గోధుమలు వంటివి ఇవ్వరాదని ఆయన అన్నారు.ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత వైద్యం, ప్రభుత్వ స్కూళ్లలో ఉచిత విద్య అందచేయకూడదని ఆయన చెప్పారు.

అంతేగాక ప్రభుత్వ బ్యాంకుల నుంచి రుణాలు ఇవ్వరాదని, ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసే హక్కు ఉండరాదని, వోటు వేసే హక్కు కూడా ఉండరాదని ఆయన చెప్పారు. ఈ విధమైన చర్యల వల్ల మైనారిటీ మతస్తులలో జనాభా గణనీయంగా తగ్గుతుందని ఆయన అన్నారు. ఆత్మరక్షణ కోసం హిందూ యవతీయువకులకు రెండు కోట్ల త్రిశూలాలు అందచేస్తామని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News