Wednesday, November 6, 2024

విఆర్‌ఎలకు అభయం

- Advertisement -
- Advertisement -

We will Solve Problems of VRA's says KTR

వారి డిమాండ్ల పట్ల ప్రభుత్వం
సానుకూలంగా ఉందన్న మంత్రి
కెటిఆర్ త్వరలో పరిష్కారం
కనుగొంటామని హామీ
ఆందోళన విరమించాలని
పిలుపు మంత్రికి ధన్యవాదాలు
తెలిపిన విఆర్‌ఎల ప్రతినిధులు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి ఆందోళన నిర్వహిస్తున్న విఆర్‌ఎలతో రాష్ట్ర ఐటి, పురపాలక శాఖల మంత్రి కెటిఆర్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ విఆర్‌ఎలకు ఇచ్చిన హామీల అమలుకు సిఎం కెసిఆర్ చిత్తశుద్ధితో ఉన్నారని స్పష్టం చేశారు. త్వరలోనే విఆర్‌ఎల సమస్యకు పరిష్కారం చూపుతామని చెప్పారు. ప్రభుత్వం, విఆర్‌ఎలు వేర్వేరు కాదని పేర్కొన్నారు. విఆర్‌ఎలు ఆందోళనలు విరమించాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. తమ సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి కెటిఆర్‌కు విఆర్‌ఎ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని మంత్రిని కోరామని వారు పేర్కొన్నారు. విఆర్‌ఎల సమస్య 25 వేల కుటుంబాలతో ముడిపడి ఉందని చెప్పారు. కాగా, రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా విఆర్‌ఎలు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. పే స్కేల్ అమలు, అర్హులైన వారికి ప్రమోషన్లు తదితర డిమాండ్లతో విఆర్‌ఎలు సమ్మెకు దిగారు.

అయితే, ఇటీవల విఆర్‌ఎలతో మాట్లాడిన కెటిఆర్ వారి డిమాండ్లు, సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని చెప్పారు. 15 నెలల క్రితం విఆర్వో వ్యవస్థను రద్దు చేసిన టిఆర్‌ఎస్ సర్కార్, మళ్లీ వాళ్లను తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ, ఇంతవరకు ఆ హామీ నెరవేర్చకపోవడంతో విఆర్‌ఎ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ఆందోళన బాట పట్టారు. వాళ్లు చేపట్టిన నిరసన మరింత ఉద్ధృతం కాగా మంత్రి కెటిఆర్ ఇటీవల స్పందించారు. తాను 17వ తారీఖు తర్వాత ఈ వ్యవహారంపై చర్చిస్తానన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మంగళవారం విఆర్‌ఎ ప్రతినిధులతో చర్చించి, వారి సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. రాబోయే క్యాబినెట్ సమావేశంలో పే స్కేల్, 55 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్, కారుణ్య నియామకాలపై నిర్ణయం తీసుకుంటామని కెటిఆర్ మాటిచ్చినట్లు తెలిసింది.

We will Solve Problems of VRA’s says KTR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News