Monday, December 23, 2024

కాలనీలోని సమస్యలు దశలవారీగా పరిష్కరిస్తాం

- Advertisement -
- Advertisement -
  • మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్

పరిగి: మున్సిపల్ పరిధిలోని పలు కాలనీలలో నెల కొన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నామని ఛైర్మన్ ముకుంద అశోక్ అన్నా రు. పరిగి పట్టణంలోని 5వ వార్డులో ఆదివారం ఆయన కౌన్సిలర్ లతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ భవాని నగర్ కాలనీలో సిసి రోడ్డు, అండర్ డ్రైనేజీ పనులు వెంటనే చేపట్టేందుకు ప్రణా ళికలను సిద్దం చేశామని తెలిపారు. అందుకు త్వరలోనే టెండర్ల ద్వారా పనులను ప్రారంభించేలా అధికారులను ఆదేశించారు.

అనంతరం తుంకు ల్‌గడ్డ వాగు వెళ్లే దారిలో రోడ్డు పక్కలా వర్షాలకు సైడ్‌లు పూర్తిగా మట్టి కొట్టుకపోవడం జరిగిందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి సహకా రంతో వెంటనే మట్టిపోయించి రోడ్డు డ్యామేజ్ కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రెండు సైడ్‌ల గోడను నిర్మాంచేలా చర్యలు చేపట్టామని తెలి పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌లు, మీర్ తహేర్ ఆలీ, బిఆర్‌ఎస్ సీని యర్ నాయకుడు బేత్ ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News