Monday, December 23, 2024

సమస్యలు పరిష్కరిస్తాం.. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందచేస్తాం

- Advertisement -
- Advertisement -

మౌలాలి : స్ధానిక సమస్యలన్ని అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరిస్తాం.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే… చెప్పిన సంక్షేమ పథకాలన్నీ తుచ మాట తప్పకుండా అర్హులకే అందచేస్తాం.. కాలనీ నేస్తం… మీకిదే కాంగ్రెస్ అభయ హస్తం అంటూ ఆ పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ స్ధానిక ప్రజలల్లో కొండంత భరోసా నింపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మల్కాజిగిరి నియోజకవర్గంలోని మౌలాలి డివిజన్ పరిధిలోని మెహదీజంగ్ (ఎంజె)కాలనీలో కాలనీ నేస్తం కాంగ్రెస్ హస్తం పేరిట ఇంటింటి పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరైన ఆ పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు, మల్కాజిగిరి నియోజకవర్గం ఇన్‌ఛార్జి నందికంటి శ్రీధర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి వారు ఎదుర్కొంటున్న స్ధానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ తరుపున హమీలు గుప్పించారు. కాలనీలో స్ధానికులు విన్నవించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళతామని, ఇకనైనా సంబంధిత అధికారులు స్ధానిక సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని , తమ ప్రభుత్వం వచ్చాక రూ. 500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తుందన్నారు. రైతులకు రూ. 2 లక్షల వరకు రుణ మాఫీ చేస్తామని ప్రకటించారు.

నిరుద్యోగులకు రూ. 4 వేల నిరుద్యోగ భృతి అందచేస్తామని, 18 సంవత్సరాలు విద్యార్ధినులకు ఎలక్ట్రిక్ బైక్‌లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. 80 గజాల మేర స్వంత జాగా ఉంటే ఇల్లు కట్టుకోవడానికి రూ. 5 లక్షలు రుణ సహాయం చేస్తామని హమీనిచ్చారు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 5 లక్షలకు వరకు పెంచి మెరుగైన వైద్య చికిత్స అందుబాటులోకి తీసుకు వస్తామని ఆయన భరోసానిచ్చారు.

ఈ కార్యక్రమంలో మౌలాలి డివిజన్ అధ్యక్షుడు వంశీ ముదిరాజ్, మౌలాలి కంటెస్ట్‌డ్ కార్పొరేటర్ పోతుల ఉమామహ్వేరీ యాదవ్, ఓబీసీ సెల్ మల్కాజిగిరి కన్వీనర్ పోతుల వినోద్‌యాదవ్, మల్కాజిగిరి బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్‌యాదవ్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జాయింట్ సెక్రటరీ సూర్యప్రకాశ్, మీడియా కన్వీనర్ గుత్తి రాంచందర్, మల్కాజిగిరి డివిజన్ అధ్యక్షుడు వాసగోని. శ్రీనివాస్‌గౌడ్, ఎస్సీ సెల్ ఛైర్మన్ సానాది శంకర్, సీనియర్ నాయకులు ఏర్పుల నాగేష్, బాలరాజుగౌడ్, బికె శ్రీనివాస్, బుచ్చిబాబు, సిలుముల కిరణ్, హమీద్, హైదర్, ఎల్లం,నరసింహ, నాగరాజుగౌడ్, చంద్రకళ, భాగ్యరాణి, యశోదమ్మ, నిర్మల , ఆశ, మాధవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News