Friday, November 22, 2024

మిస్టర్ ఇండియాకు అండగా నిలుస్తాం: క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : వచ్చే నెలలో జరిగే ‘మిస్టర్ గ్లోబల్’ టైటిల్ కోసం పోటీపడుతున్న హైదరాబాద్ కు చెందిన యువకుడు జాసన్ డైలాన్ బ్రెట్ఫీలియాన్‌కు అన్ని విధాల అండగా ఉంటామని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మిస్టర్ ఇండియాగా గెలిచిన అతను ఇటీవలే గోవాలో జరిగిన రుబారు మిస్టర్ ఇండియా- 2023 టైటిల్ పోటీలో విజయం సాధించారన్నారు. ఈ నేపథ్యంలో జాసన్ తన తల్లితండ్రులు రూప్ చందన, వాలెంటీన్ బ్రెట్ఫీలియాన్‌లతో కలిసి మహబూబ్ నగర్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కలిశారు. దేశవ్యాప్తంగా అనేక మంది పోటీ పడినా ఫైనల్ పోరులో గెలిచి తెలంగాణ పేరు నిలబెట్టి మిస్టర్ ఇండియాగా నిలిచినందుకు జాసన్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు.

థాయిలాండ్‌లో జరుగనున్న మిస్టర్ గ్లోబల్ టైటిల్ పోరు కోసం వెళ్లేందుకు ఆర్థికంగా చేయూతను అందిస్తామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడల్లో తెలంగాణ దూసుకుపోతోందని, అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి, దేశానికి పేరు తెస్తున్న క్రీడాకారులను గుర్తించి వారికి నగదు బహుమతి, ఇంటి స్థలాలను అందజేసి ప్రోత్సహిస్తున్నామన్నారు. జాసన్ మిస్టర్ వరల్డ్ పోటీల్లోనూ టైటిల్ కైవాసం చేసుకుని రాష్ట్రానికి దేశానికి పేరు తీసుకురావాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఈ సందర్భంగా జాసన్‌ను సన్మానించి చారు. కాగా తనకు అందిస్తున్న సహకారానికి మిస్టర్ ఇండియా జాసన్ ఈ సందర్భంగా మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News