Thursday, January 23, 2025

పోలీస్ బెటాలియన్‌లో సుంధరీకరణ పనులు ప్రారంభిస్తాం

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్ : యాపల్గూడలోని పోలీస్ బెటాలియన్‌లో అవసరమైన సుంధరీకరణ పనులు త్వరిగతిన పూర్థి చేసేలా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేంధర్ పేర్కొన్నారు. ఇటీవల బెటాలియన్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ఎమ్మెల్యే జోగు రామన్న హాజరై అభివృద్ధి పనుల విషయమై హామీ ఇవ్వగా శుక్రవారం బెటాలియన్‌ను సందర్శించి స్థానిక అధికారులతో వివిధ అంశాల పై చర్చించారు.

పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చేపట్టాల్సిన అభివృద్ధి పనులతో సహా సుందరీకరణకు సంబంధించిన అంశాల పై చర్చించారు. త్వరలోనే పనులు ప్రారంభించి నిర్థేశిత సమయంలో పూర్థి చేసేలా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేంధర్ మాట్లాడుతూ బెటాలియన్‌లో చేపట్టాల్సిన పనుల విషయాలన్నీ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గండ్రత్ రమేష్, సర్పంచ్ పెందూర్ గంగారాం, నాయకులు కుమ్ర రాజు, ఆరే నరేష్, ఈ. అరుణ్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News