Monday, December 23, 2024

కబ్జాదారుల భరతం పడతాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హుజూర్‌నగర్: తెలంగాణ రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల అభ్యున్నతే ల క్షంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖమంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు అన్నారు. శనివారం సూ ర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఫణిగిరి శ్రీసీతా రామచంద్ర స్వా మిగట్టు వద్ద ఆదర్శనగర్‌లో నిర్మించిన 2160 ఇందిరమ్మ ఇళ్ళను మంత్రులు పరిశీలించారు. అనంతరం సమీపంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో చేపట్టనున్న అభివృద్ధ్ది కా ర్యక్రమాలపై జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రు లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ యావత్ తెలంగాణలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని, వాటిని ప్రజలకు పంచుతామని అన్నారు.2013లో గృహ నిర్మాణశాఖ ద్వారా నిర్మిం చిన ఇందిరమ్మ ఇళ్ళను మూడు నెలలలోపు పూర్తి చేసి అర్హులైన వారికి అందజేసి తెలంగాణ రాష్ట్రంలోని ఇందిరమ్మ ఇళ్ళకు నాంది పలుకుతామని తెలిపారు. దేవాదాయ శాఖకు సంబంధించిన 109 ఎకరాల భూమిని రూ. 20 కోట్లను రెవెన్యూ శాఖ ద్వా రా చెల్లించి, గృహనిర్మాణ శాఖ ద్వారా నిర్మించడం జరిగిందని వివరించారు. దాదాపుగా 70శాతం పూ ర్తైన పనులను గడిచిన 10 సంవత్సరాలల్లో రూ. 30 కోట్లు వెచ్చించి నిర్మాణ పనులు పూర్తిచేయకపోవడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. 77 ఎకరాలలో ఉన్న ఆదర్శ కాలనీని యుద్ధ్ద ప్రాతిపదికన నిర్మాణాలు పూర్తిచేస్తామని చెప్పారు. అలాగే 32 ఎకరాలలో ఉన్న ఖాళీ స్థలంలో అర్హులైన వారిని గుర్తించి ఇండ్ల స్థ్ధలాలు అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు.

ఆరు గ్యారంటీ పథకాల అమలులో భాగం గా ఈనెల 25న సిఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెబుతారని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు సుపరిపాలనను అందిస్తామని, మేము పాలకులం కాదు సేవకులమని ప్రజాసేవకు అంకితమవుతామన్నారు. గత ప్రభుత్వం మాటల గారడీలతో ప్రజలను మభ్యపెడుతూ ఎన్నో శంకుస్ధాపనలు చేసుకుంటూ పోయిందని, రాష్ట్రంలోని అన్ని రంగాలను బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. నీటి పారుదల రంగంలో పటిష్ట ప్రణాళికతో రైతులకు మెరుగైన నీటిసదుపాయం కల్పిస్తామని జిల్లాలోని అన్ని లిఫ్ట్‌లు, చెక్‌డ్యామ్‌లను పునరుద్ధ్దరించడం జరుగుతుందన్నారు. రోడ్ల మరమ్మతులు చేసి, నూతన రోడ్లను వేయిస్తామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఒక సంవత్సరంలో 13 లక్షల ఇందిరమ్మ ఇంళ్ళను చేపట్టడం జరిగిందని తెలియజేశారు. ఎన్నికలల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను రాజకీయాలకు అతీతంగా పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అధికారులు నియమనిబద్ధ్దలతో పనిచేయాలని సూచించారు. లిఫ్ట్ ఇరిగేషన్ల వద్దనున్న ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మత్తులు చేసి సత్వరమే వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్. వెంకట్రావ్, అదనపు కలెక్టర్లు సి.హెచ్ ప్రియాంక, ఏ. వెంకటరెడ్డి, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ రమేష్, హౌసింగ్ చీఫ్ ఇంజనీర్ ఈశ్వరయ్య, ఆర్‌డీఓ జగదీశ్వర్‌రెడ్డి, సీఈఓ సురేష్ కుమార్, పి.డి కిరణ్‌కుమార్,డి.పి.ఓ యాదయ్య, సి. పి.ఓ వెంకటేశ్వర్లు, తహశీల్ధార్లు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News