Sunday, December 22, 2024

ప్రభుత్వ లక్ష్యాలను ముందుకు తీసుకెళతాం

- Advertisement -
- Advertisement -

సిఎం రేవంత్‌తో టిజిఓ సంఘం నాయకులు

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షులు వి. మమత, ప్రధాన కార్యదర్శి ఏ. సత్యనారాయణ ఆధ్వర్యంలో టిజిఓ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా ప్రభుత్వ లక్ష్యాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తామని,  తెలంగాణ అభివృద్ధికి ఉద్యోగులంతా తోడ్పాటునందిస్తారని.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి టిజిఓ సంఘం తెలియజేసింది. ఈ కార్యక్రమంలో పి. రవీందర్ కుమార్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎమ్.బి. కృష్ణాయాదవ్, బి.వెంకటయ్య, కృష్ణమూర్తి, సుజాత, సబిత, నిరంజన్ రెడ్డి , యాదగిరి , ఉమాకాంత్ తదితరులు కలిసి సిఎంకు శుభాకాంక్షలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News