Sunday, January 19, 2025

వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం

- Advertisement -
- Advertisement -

ఎల్బీనగర్: వర్షాకాలంలోపు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఎల్బీనగర్ ఎంఎల్‌ఎ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ లింగోజిగూడ డివిజన్ పరిధిలో అల్తాఫ్‌నగర్ కొంత మేర నీటితో మునిగిపోవడంతో శుక్రవారం కాలనీలలో తిరిగి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం రాత్రి నుంచి మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్‌రావు అక్కడే ఉండి స్థ్దానికులకు సహాయ, సహకారాలు అందించారని తెలిపారు. ఇంట్లోకి నీరు వచ్చిన వా రందరికి కమ్యూనిటీ హాల్‌కు తరిలించి భోజన సదుపాయాలు కల్పించారని గుర్తు చేశారు.

పాఠశాల ప్రహారీగోడ తొలగించి వరద నీరు పోవడానికి చ ర్యలు చేపట్టారు. వర్షాకాలంలోపు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటానని, 90 శాతం పనులు పూర్తి జరిగిందని, ప్రస్తుతం జరిగిన ఇబ్బందులకు క్షమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు కోటేశ్వర్‌రావు, కనకయ్య, డివిజన్ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి, తిలక్‌రావు, రాకేష్ ఠాగుర్, మహేందర్‌రెడ్డి, బోంబాయి, వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News