Monday, December 23, 2024

లేడీస్ హాస్టల్ లోకి దుండగులు

- Advertisement -
- Advertisement -

ఇద్దరు మహిళలతో కూడిన భద్రతా సిబ్బందిని నియమిస్తాం
హాస్టల్ చుట్టూ పది అడుగుల ఎత్తులో గోడ నిర్మిస్తాం: ఓయూ విసి రవీందర్

మన తెలంగాణ/హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయ సికింద్రాబాద్ పిజి కళాశాల విద్యార్థులతో ఉపకులపతి ఆచార్య దండెబోయిన రవీందర్ యాదవ్, రిజిస్ట్రార్ ఆచార్య పి. లక్ష్మినారాయణ, ఓఎస్డీ ఆచార్య బి రెడ్యానాయక్ సమావేశమయ్యారు. యూనివర్శిటీ అధికారులతో కలిసి పిజి కళాశాలను పరిశీలించారు. ఇటీవల ఇద్దరు దుండగులు మహిళా కళాశాల వసతి గృహాల్లోకి ప్రవేశించే ప్రయత్నం చేసిన విషయంపై సమీక్షించారు. తిరిగి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సత్వరమే రాత్రి సమయంలో ఇద్దరు పరుషులు, ఇద్దరు మహిళలతో కూడిన భద్రతా సిబ్బందిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థినుల భద్రత కోసం వసతి గృహం చుట్టూ పది అడుగుల ఎత్తుతో గోడ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల ఏర్పాటు, మెస్, వసతి గృహాల్లో ఉన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పీజీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రవికుమార్ జాస్తి, విద్యార్థి సంక్షేమ వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ రాజేంద్ర నాయక్, ప్రొఫెసర్ నవీన్ కుమార్, చీఫ్ వార్డెన్ డాక్టర్ కొర్రెముల శ్రీనివాస్, డాక్టర్ కళ్యాణ లక్ష్మి సహా ఆయా విభాగాల బాధ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News