Monday, December 23, 2024

రాబోయే ఎన్నికల్లో 100సీట్లు గెలుచుకుంటాం : హోంమంత్రి

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్: రానున్న సా ధారణ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ 100సీట్లు గెల్చుకుంటుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమ పథకాలను అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రభాగాన ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ముషీరాబాద్ కషీష్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం సంక్షేమ సంబురాలు ఘనంగా జ రిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన మహమూద్ అలీ మాట్లాడుతూ గత తొమ్మిదేళ్లుగా సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ది పర్చినట్టు చెప్పారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీలు ఏమాత్రం అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు.

తెలంగా ణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం అధికారంలోకి వచ్చిన బిఆర్‌ఎస్ ప్రభుత్వం అర్హులైన వారికి కళ్యాణ లక్ష్మీ, ఆసరా పింఛన్లు, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా వంటి అ నేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నా రు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సం క్షేమ పథకాల నేపథ్యంలో బిఆర్‌ఎస్ పార్టీకి దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ లబిస్తోందని తె లియజేశారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెచ్‌ఎంసీ డిఎంసి డాక్టర్ తిప్పర్తి యాదయ్య, తహసీల్దార్లు అయ్యప్ప, మల్లేష్, ఈఈ శ్రీనివా స్, డిఈ సన్నీ, ముషీరాబాద్ ఏస్‌డబ్లూఓ ఆర్. శాంతి, మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్ రెడ్డి, బిఆర్‌ఎస్ యువజన నాయకులు ముఠా జైసింహ, సీనియర్ నాయకులు హరిబాబు యాదవ్, పెంటారెడ్డి, బిఆర్‌ఎస్ భోలక్‌పూర్ డివిజన్ అధ్యక్షులు వై.శ్రీనివాస్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కు లాంతర వివాహాలు చేసుకున్న మూడు జంటలకు ఎస్సీ సంక్షేమ శాఖ నుంచి రూ. 2.50 లక్ష లు చొప్పున చెక్కులను ఎమ్మెల్యే ముఠా గోపాల్ చేతుల మీదుగా అందజేశారు. హి మాయత్‌నగర్ మండలానికి చెందిన 15 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News