Sunday, December 22, 2024

400 సీట్లు గెలుస్తాం : అఖిలేశ్ యాదవ్

- Advertisement -
- Advertisement -

We will win 400 seats Says Akhilesh Yadav

అలీగఢ్ : సమాజ్‌వాదీ ఆర్‌ఎల్‌డీ కూటమి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 400 సీట్లు గెలుచుకుంటుందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అన్నారు. అధికార పార్టీపై ప్రజాగ్రహమే తమ పార్టీకి భారీగా సీట్లు తెచ్చి పెడతాయని, 400 సీట్లు తమ కూటమి గెలుచుకుంటే తక్కినవారికి వచ్చేవి 3 సీట్లేనని అలీగఢ్‌లో ఆయన చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితులను కాపాడటంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని, ఆరోపించారు. అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై జరిగిన కాల్పుల ఘటనను తాము వెంటనే చెప్పారు. ఇది పూర్తిగా శాంతిభద్రతల వైఫల్యమేనని అన్నారు. ఇలాంటి పరిస్థితులను తాము చాలానే చూశామని చెప్పారు. హథ్రాస్ ఘటనపై మాట్లాడుతూ , న్యాయం జరగాలని బాధితురాలి కుటుంబ సభ్యులు కోరారని, ఆమెకు గౌరవ ప్రదంగా అంత్యక్రియలు జరపాలని అనుకున్నారని, అయితే ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదని విమర్శించారు. ఆస్పత్రిలో ఆమెకు తగిన చికిత్స అందించి ఉంటే ఆమె ఈరోజు బతికి ఉండేదని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News