Monday, December 23, 2024

పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుస్తాము : అసదుద్దీన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపి అసదుద్దీన్ ఓవైసి ధీమా వ్యక్తం చేశారు. తాము పోటీ చేసిన ఏడు సిట్టింగ్ స్థానాలతో పాటు జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ స్థానాల్లోనూ ఎంఐఎం అభ్యర్థులు విజయం సాధిస్తారన్నారు. తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయడానికి సమయం కేటాయించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎంఐఎం అభ్యర్థుల విజయానికి నిబద్దతతో కృషి చేసిన పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులకు అసదుద్దీన్ ఓవైసి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతం శాంతితో ప్రగతి పథంలో కోనసాగుతుందన్న ఆశాభాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు అసదుద్దీన్ గురువారం రాత్రి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News