Monday, December 23, 2024

ప్రజా బలంతో అన్ని స్థానాల్లో గెలుస్తాం !

- Advertisement -
- Advertisement -

20 మంది అభ్యర్ధులతో బిఎస్పీ తొలి జాబితా విడుదల: డా. ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
మన తెలంగాణ/ హైదరాబాద్:  ప్రజాబలంతో వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుస్తామని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆపార్టీ నేషనల్ కో-ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు రాంజీ గౌతమ్, డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బిజెపి,కాంగ్రెస్ పార్టీలు ఆచరణ కానీ అబద్ధపు హామీలతో మోసపూరిత మేనిఫెస్టోలను ప్రజలేవరు నమ్మొద్దన్నారు. వచ్చే ఎన్నికల్లో లబ్ది కోసమే తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పసుపు బోర్డు,గిరిజన యూనివర్సటీ ప్రకటనలు చేశారని విమర్శించారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ,కాజిపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ,పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయహోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఐటీఐఆర్ ప్రాజెక్ట్ రద్దు ,కొత్త ఐఐటీ,ఐఐఐటీ, ఐఐఎంలు ఎందుకు ఏర్పాటు చేయలేదని నిలదీశారు.

తొలి జాబితా విడుదల …
1. సిర్పూర్ (జనరల్) – డా.అర్. ఎస్.ప్రవీణ్ కుమార్
2. జహీరాబాద్ (ఎస్సీ) – జంగం గోపీ
3. పెద్దపల్లి (జనరల్) – దాసరి ఉష
4. తాండూరు (జనరల్) – చంద్రశేఖర్ ముదిరాజ్
5. దేవరకొండ (ఎస్టీ)- డా.ముడావత్ వెంకటేష్ చౌహాన్
6. చొప్పదండి (ఎస్సీ) – కొంకటి శేఖర్
7. పాలేరు (జనరల్) – అల్లిక వెంకటేశ్వర్ రావు
8. నకిరేకల్ (ఎస్సీ) – మేడి ప్రియదర్శిని
9. వైరా (ఎస్టీ)- బానోత్ రాంబాబు నాయక్
10. ధర్మపురి (ఎస్సీ) – నక్క విజయ్ కుమార్
11. వనపర్తి (జనరల్) – నాగమోని చెన్న రాములు
12. మనకొండూరు (ఎస్సీ) – నిషాని రామచందర్
13. కోదాడ (జనరల్) – పిల్లిట్ల శ్రీనివాస్
14. నాగర్ కర్నూల్ (జనరల్)- కొత్తపల్లి కుమార్
15. ఖానాపూర్ (ఎస్టీ)- – బాన్సీలాల్ రాథోడ్
16. అందోల్ (ఎస్సీ) – ముప్పారపు ప్రకాష్
17. సూర్యాపేట (జనరల్) – వట్టే జానయ్య యాదవ్
18. వికారాబాద్ (ఎస్సీ) – గోర్లకాడి క్రాంతి కుమార్
19. కొత్తగూడెం (జనరల్) – ఎర్ర కామేష్
20. జుక్కల్ (ఎస్సీ) – ప్రద్యాన్ కుమార్ మాధవరావు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News