Monday, December 23, 2024

ఆ రెండు ట్రోఫీలు సాధిస్తాం: బిసిసిఐ కార్యదర్శి జైషా

- Advertisement -
- Advertisement -

ముంబై: రానున్న రోజుల్లో రెండు మెగా టోర్నమెంట్‌లలో ట్రోఫీలు సాధించడమే లక్షంగా ముందుకు సాగుతున్నట్టు భారత క్రికెట్ బోర్డు కార్యదర్శి జైషా పేర్కొన్నారు. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ఇప్పటికే టి20 ప్రపంచకప్‌ను గెలుచుకుందని జైషా తెలిపారు. సియెట్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న జై షా ఈ విషయాన్ని వెల్లడించారు. వెస్టిండీస్, అమెరికాలు ఆతిథ్యం ఇచ్చిన పొట్టి ప్రపంచకప్‌లో భారత్ అసాధారణ ఆటతో ట్రోఫీని సొంతం చేసుకుందన్నారు. భారత్ విజయంలో సమష్టి కృషి దాగివుందన్నారు.

త్వరలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లలో కూడా భారత్ విజేతగా నిలువడం ఖాయమని జైషా జోస్యం చెప్పారు. రోహిత్ సారథ్యంలో టీమిండియా ఈ రెండు మెగా టోర్నీలు గెలుస్తుందనే నమ్మకం తనకుందన్నారు. జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదన్నారు. ఎలాంటి జట్టునైనా ఓడించే సత్తా భారత్‌కు ఉందన్నారు. ఇలాంటి స్థితిలో ఈ రెండు మెగా టోర్నీల్లో విజయం సాధించడం టీమిండియాకు కష్టమేమీ కాదని జైషా అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News