Wednesday, January 22, 2025

బోర్డర్‌గవాస్కర్ సిరీస్‌ గెలుస్తాం: జడేజా

- Advertisement -
- Advertisement -

ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్‌గవాస్కర్ సిరీస్‌లో టీమిండియా కచ్చితంగా విజేతగా నిలుస్తుందని స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా జోస్యం చెప్పాడు. ఆస్ట్రేలియా గడ్డపై హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమన్నాడు. ఆసీస్‌ను ఓడించే అన్ని వనరులు తమ వద్ద ఉన్నాయన్నాడు. మెల్‌బోర్న్ వేదికగా జరిగే బాక్సింగ్ డే టెస్టులో తాము మెరుగైన ప్రదర్శన చేస్తామన్నాడు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా మిగిలిన మ్యాచుల్లో ఆడతామన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తమ జట్టు సమతూకంగా ఉందన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు జట్టులో ఉన్నారన్నాడు. దీంతో సిరీస్ గెలవడం తమకు కష్టమేమీ కాదన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News