చారకొండ : మండల పరిధిలోని గోకారం రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా భూమిని కోల్పోయిన రైతులకు నెల రోజుల్లోగా నష్ట పరిహారం అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు . మాజీమంత్రి చిత్తరంజన్‌దాస్,స్థానిక ప్రజాప్రతినిధుల పిలుపు మేరకు శనివారం వారితో కలిసి గోకారం రిజర్వాయర్ సందర్శించి మాట్లాడారు.
వందల ఎకరాల్లో సాగు నీరు అందించే గోకారం చెరువును పాలమూరు,రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చెరువు కట్టను తొలగించారు. ఫలితంగా పడిన నీరు పడినట్లుగా దిగువకు వెళ్లిపోతోంది. చుక్కనీరు లేకుండా చెరువు ఎడారిలా తయారైందన్నారు. చెరువుపై ఆధార పడే మత్సకారులు ,పంటలు సాగు చేసే రైతులు తీవ్ర నష్టపోయారు.నష్టపరిహారం అందించడంలో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు.
రైతులు తమ దృష్టికి తీసుకు వచ్చిన నష్ట పరిహారం రూ.5.5లక్షలు కాకుండా పెంచే విధంగా సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేకూరేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సిఎం కెసిఆర్ రైతు పక్షపాతి అని,సానుకూలంగా స్పందిస్తారనే నమ్మకం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో గోకారం మాజి సర్పంచ్ భాస్కర్‌రెడ్డి,చంద్రయన్‌పల్లి సర్పంచ్ వసంతా సాంబయ్యగౌడ్,బారాస నేతలు,రైతులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.