Friday, December 20, 2024

బడే నాగజ్యోతి గెలుపునకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం

- Advertisement -
- Advertisement -
  • ములుగు నియోజకవర్గ బిఆర్‌ఎస్ శ్రేణులు

ములుగు జిల్లా ప్రతినిధి: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్ధి, జడ్పీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ములుగు నియోజకవర్గ బిఆర్‌ఎస్ శ్రేణులు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయలంలో ములుగు నియోజకవర్గ అభ్యర్ధి, జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతిని వివిధ మండలాల నుండి పార్టీ శ్రేణులు, మండల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, కేయు విశ్వవిద్యాలయ విద్యార్ధి విభాగం నాయకులు వచ్చి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ములుగు అసెంబ్లీ స్ధానాన్ని రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిపించుకుంటామని, ఎమ్మెల్యే సీటును సీఎం కేసిఆర్ కు బహుమతిగా ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్ సభ్యురాలు వలియాభీ, ఏటూర్ నాగారం ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య, సీనియర్ నాయకులు మల్లారెడ్డి, లక్ష్మీనారాయణ, జగదీష్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News