Wednesday, January 22, 2025

బిజెపి వ్యతిరేక శక్తులతో కలిసి నడుస్తాం

- Advertisement -
- Advertisement -

We will work together with the anti-BJP forces:sitaram yechury

సిపిఎం జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి ప్రకటన

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధానిగా మోడీ అన్ని రంగాల్లో వైఫల్యం చెం దారని సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి తప్పుబట్టారు. ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి రాజకీయ నిర్ణయాలుంటాయని తెలిపారు. సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాలు ఆదివారం నాడు ముగి శాయి. శుక్రవారం నాడు హైదరాబాద్‌లో సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యా యి. ఈ సమావేశాల్లో సిపిఎం దేశంలోని రాజకీయ పరిస్థితులతో పాటు ఐదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. సిపిఎం జాతీయ కమిటీ సమావేశాలు ముగిసిన సందర్భంగా ఆదివారం నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏచూరి మీడియాతో మాట్లాడారు. మూడ్రోజుల పాటు నిర్వహించిన కేంద్ర కమిటీ సమావేశాల్లో 23 రాజకీయ తీర్మానాలను ఆమోదించామని చెప్పారు. ఐదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విప క్షాల ఓట్లు చీలకుండా ఉండేందుకు కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. బిజెపిని వ్యతిరేకిస్తూ వచ్చే వారితో కలిసి ముందుకెళ్తామని స్పష్టం చేశారు.

నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి

త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఇసిని కోరారు. రాజ్యాంగం ఇచ్చిన అధికారం మేరకు దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలను నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని కోరారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలు తీసుకోవాలన్నారు. డబ్బును ఉపయోగించుకుంటూ నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగకుండా బిజెపి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు.

ఎన్నికల తర్వాత ఫ్రంట్‌లతోనే ఫలితాలు..

ఎన్నికల ముందు ఏర్పాటు చేసిన ఫ్రంట్‌లు ఫలితాలను ఇవ్వలేదని చెప్పా రు. ఎన్నికల ఫలితాల తర్వాత ఫ్రంట్‌లు అత్యుత్తమ ఫలితాలు ఇచ్చాయన్నారు. 1996 2004 వరకు ఏర్పడిన ఫ్రంట్‌ల గురించి వివరించారు.

బిజెపిపై సర్కార్ సాఫ్ట్ కార్నర్‌కు తాము వ్యతిరేకం

బిజెపిపై రాష్ట్ర సర్కార్ పోరాటంలో లోపముందని.. బిజెపిని కొన్ని విషయాల్లో మాత్రమే సర్కార్ వ్యతిరేకిస్తోందని.. బిజెపిపై సర్కార్ సాఫ్ట్ కార్నర్‌కు తాము వ్యతిరేకమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. బిజెపిని వ్యతిరేకించే పార్టీలతో కలిసి పనిచేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News