వనపర్తి ప్రతినిధి : వనపర్తి నియోజకవర్గం లో కాంగ్రెస్ గెలుపే ధ్యేయంగా పని చేస్తామని కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు, పెద్దమందడి ఎంపిపి మెగా రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని నంది హిల్స్‌లోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భ ంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన ఏఐసిసి కొల్లాపూర్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ హాజరు కానున్నారని తెలిపారు. ఈ సభకు వనపర్తి నియోజకవర్గం నుంచి 30 నుంచి 35 వేల మందిని తరలిస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వేలాది మంది నాయకులు, ప్ర జా ప్రతినిధులు చేరబోతున్నారని ఆయన అన్నారు.
ఈ క్రమ ంలో 20వ తేదిన కొల్లాపూర్‌లో భారీ బహిరంగ సభలో మాజీ శాసన సభ్యులు గురునాథ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు రాజశేఖర్ రెడ్డి, గద్వాల జెడ్పి చైర్మె న్ సరిత, వనపర్తి నియోజకవర్గ పరిధి నుంచి పలువురు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని ఆయన తెలిపారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా వనపర్తి నియోజకవర్గంలో పెద్ద, చిన్న, కొత్త, పాతలాంటి తారతమ్యాలు లేకుండా కాంగ్రెస్ పార్టీలో కలిసికట్టుగా పనిచేస్తామని ఆయన అన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగరవేసేందుకు ఎవరితోనైనా కలిసి పనిచేస్తామని, ఎవరినైనా కలుపుకుని ముందుకెళ్లేందుకు తమందరం సిద్ధంగా ఉన్నామన్నారు. చిన్నారెడ్డితో కలిసి పనిచేస్తామని అన్నారు.
అధికారులు సమన్వయంతో పనిచేయాలి త ప్ప అక్రమ కేసులు చేస్తే ఊరుకునేది లేదన్నారు. బిఆర్‌ఎస్ పా ర్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వారి పట్ల అక్రమ కేసులు చేయడం, వారిని ఇబ్బందులకు గురి చేయడం పరిపాటయ్యిందన్నారు. కేసులకు భయపడే వారు ఎవరూ లేరని ఆయన అన్నారు. వనపర్తి జిల్లాలో ఉన్నత స్థాయి అధికారుల నుంచి గ్రామస్థాయి అ ధికారులు సైతం ప్రోటోకాల్ పాటించకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ఇది మంచిది కాదని ఆయన అన్నారు. ఈ సమావేశంలో వనపర్తి కౌన్సిలర్లు బ్రహ్మం, రాధాకృష్ణ, సాయి చరణ్ రెడ్డి, రమేష్ గౌడ్, గట్టు యాదవ్, మన్యంకొండ గట్ల కనాపూర్ తిరుపతయ్య యాదవ్, సత్యరెడ్డి, సత్యశీలారెడ్డి, టిఎంఆర్ బృందం సభ్యులు ఏన్నారు.