Monday, December 23, 2024

తెలంగాణను కాంగ్రెస్‌కు ఏటిఎం కాన్వివం: కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్:  తెలంగాణను కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం కానివ్వబోమని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ మేనిఫెస్టోపై ప్రజలకు నమ్మకం లేదనే.. గ్యారెంటీ అనే కొత్త పదాలను తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చదని, అవినీతి మాత్రం పెద్ద మొత్తంలో జరుగుతుందన్నారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు.

ఆపార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలు స్థాపన, అభివృద్ధి జరగదన్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉద్యోగాలు వచ్చినా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రం ఒకరికి ఉద్యోగం రాలేదని విమర్శించారు. భారత్‌ను బలోపేతం చేయడం, ఆర్థిక వ్యవస్థను పరిపుష్టి చేయడం తమ పార్టీ మూల సిద్ధాంతమని చెప్పారు. బిసి నాయకత్వంలో అనేక రాష్ట్రాల్లో అభివృద్ధి జరిగిందన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే బిసిలకు అధికారం ఇవ్వాలని బిజెపి నిర్ణయించిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News