కరాచీ: తమ దేశంలో జరిగే ఆసియా కప్‌లో టీమిండియా పాల్గొనక పోతే తాము కూడా భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా స్పష్టం చేశాడు. పాకిస్థాన్‌లో జరిగే ఆసియా కప్‌లో భారత్ పాల్గొంటుందనే నమ్మకం తనకుందన్నాడు. ఒకవేళ భారత్ ఈ టోర్నీకి దూరమైతే మాత్రం తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వరల్డ్‌కప్‌లో ఆడమని తేల్చి చెప్పాడు.
తాము పాల్గొనక పోతే దాని ప్రభావం వరల్డ్‌కప్ తప్పక ఉంటుందన్నాడు. దాయాది దేశాల మధ్య జరిగే పోరుకు ప్రపంచ వ్యాప్తంగా విపరీత క్రేజ్ ఉన్న విషయాన్ని రమీజ్ రాజా గుర్తు చేశాడు. ఒకవేళ ఈ మెగా టోర్నీకి తమ జట్టు దూరమైతే మాత్రం భారత బోర్డుకు భారీ షాక్ తగలడం ఖాయమన్నాడు. ఇరు దేశాల మధ్య జరిగే మ్యాచ్ ఉన్న ఆదరణ ప్రపంచకప్‌కే ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని, ఒకవేళ తాము తప్పుకుంటే దాని ప్రభావం ఈ టోర్నీపై తప్పకుండా పడుతుందన్నాడు.