Monday, January 20, 2025

కృష్ణాబోర్డుకు అప్పగించం

- Advertisement -
- Advertisement -

శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులను అప్పగిస్తామని కేంద్రానికి హామీ ఇవ్వలేదు

మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదిపై ఉన్న సాగునీటి ప్రాజెక్టులను కృష్ణానదీ బోర్డుకు అప్పగించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించే ప్రసక్తే లేదని రాష్ట్ర మంత్రులు వెల్లడించారు. శుక్రవారం నాడు సచివాలయంలో ఏ ర్పాటు చేసిన మీడియా సమావేశంలో నీటి రుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. , నాగార్జున సాగర్ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తామని కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి హా మీలు ఇవ్వలేదన్నారు. ఢిల్లీలో జరిగిన సమావేశం లో పాల్గొన్న రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారు లు కేంద్రం ప్రతిపాదించిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని, ప్రభుత్వ ఆదేశాల నిర్ణయం తెలియజేస్తామని వెల్లడించినట్టు మంత్రు లు వివరించారు.

కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలపై బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు ప్రజలను తప్పుదోవపట్టిస్తూ అవాస్తవాలతో ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలు అవాస్తవా లు అంటూ తోసిపుచ్చారు. తాను నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద ఉన్న నియోజకవర్గం నుంచి ఎంపిగా, ఎంఎల్‌ఎగా పలుసార్లు ప్రాతినిధ్యం వహించానని, సమస్య ఏమిటో తనకు తెలుసని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌పై ఎపిలో ఎత్తిపోతల పథకాలు నిర్మించి రాయలసీమకు నీటిని తీసుకుపోతుంటే బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం చేసిందన్నారు. ఎపి సిఎం జగన్‌తో కలిసి అలయ్‌బలయ్ అడిం ది, ఏకాంత చర్చలు జరిపింది కెసిఆర్ కాదా అని ప్రశ్నించారు.

ఉప ముఖ్యమత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఖమ్మం జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించామని, రాష్ట్రం తెచ్చుకుందే నీళ్ల కోసం, అయితే గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు అని పేరు చెప్పి ప్రాజెక్టు అంచనా వ్యయాలను భారీగా పెంచిందన్నారు. 2104నాటికి ఇందిరాసాగర్ ప్రాజెక్టుకు రూ.1400కోట్లతో 3.32 లక్షల ఎకరాలకు నీరందించాలన్నది లక్షగా పెట్టుకోగా, దీని అంచనాలు రూ.18వేలకోట్లకు పెంచారన్నారు. కొత్తగా ఆయకట్టు మాత్రం ఒక్క ఎకరా కూడా పెంచలేదన్నారు. రాజీవ్ సాగర్ ప్రాథమిక అంచనా రూ.1680కోట్లుకాగా, ఉమ్మడి ఎపిలోనే ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం రూ.889కోట్లు ఖర్చు చేసిందన్నారు. మిగతా రూ.792కోట్లు ఖర్చు చేయాల్సి ఉండేదన్నారు.

ఇందిరాసాగర్ ప్రాజెక్టు ప్రాథమిక అంచనా రూ.1824కోట్లు కాగా, ఉమ్మడి ఎపిలోనే దీనిపై రూ.1064కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. మిగిలిన పనులకు రూ.760కోట్లు ఖర్చు చేయాల్సి ఉండేదన్నారు. రాజీవ్‌సాగర్ ఇందిరాసాగర్ ప్రాజెక్టులకు మొత్తం రూ.1552కోట్లు ఖర్చు చేసి వుంటే ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయివుండేవన్నారు. గత ప్రభుత్వంలో కెసిఆర్ రీడిజైన్ పేరుతో ఈ రెండు ప్రాజెక్టులను కలిపి సీతారామ ప్రాజెక్టు అని పేరుపెట్టారన్నారు.దీని అంచానాలు రూ13057కోట్లకు పెంచారన్నారు. దీనిపై ఇప్పటివరకూ వేల కోట్లు వ్యయం చేశారని అదనపు ఆయకట్టు కూడా ఏమి పెంచలేదన్నారు. ఈ ప్రాజెక్టుకు నీటిని అందజేసేందకు .సీతమ్మసాగర్ బ్యారేజీ అని రూ.3,486 కోట్లకు ప్రాజెక్టు ఖర్చు అంచనా వేశారు.

మొత్తం మూడు ప్రాజెక్టులను రీడిజైన్ల పేరుతో అంచనాలు 22981కోట్లకు పెంచారని తెలిపారు. అందులో రీడిజైన్ పేరుతో ఒక్క ఎకరానికి నీరు అందివ్వలేదన్నారు. మొదటి మూడు సంవత్సరాల్లో సంవత్సరానికి 500 కోట్లు ఖర్చు చేస్తే వేల ఎకరాలకు నీరు వచ్చేదని , దోపిడీ నుంచి రాష్టాన్ని కాపాడటానికి ప్రజల సహకారం అవసరం అన్నారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందే నీళ్ళ కోసం అని కాని టిఆర్‌ఎస్ ప్రభుత్వం రీడిజైన్లపేరతో భారీ దోపిడికి పాల్పడిందని ఆరోపించారు.ఉమ్మడి ఏపిలో చేపట్టిన దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్టు అంచనాలు 1681కోట్ల ప్రాజెక్టు మాత్రమే అని తెలిపారు. 2014 తర్వాత మిగుల పనులకు 7వందల కోట్లు ఖర్చు చేస్తే అయిపోయేదన్నారు. రెండు ప్రాజెక్టుల 1552 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యేవని తెలిపారు. ఇంతటి దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడడానికి ప్రజలు సహకరించాలని కోరారు. ఇంతటి దోపిడీ నీ చూసి కడుపు తరుక్కుపోతోందని మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
సీతారామపై క్షేత్ర స్థాయి పరిశీలన : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సీతారామ ప్రాజెక్టుపై క్షేత్ర స్థాయి పరీశీలన చేయనున్ననట్టు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో సీతారామ సాగర్ విజిట్ చేస్తామన్నారు. సీతారామ ప్రాజెక్టుపై కేబినెట్ లో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. పదేళ్లలో ఒక్క ప్రాజెక్టుకు సైతం సరైన ఫార్మాట్ లో జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి అప్లై చెయ్యలేదన్నారు. జాతీయ హోదా అనేది దేశంలో ఎక్కడా ఇవ్వలేదు అని గజేంద్ర సింగ్ షెకావత్ ఇటీవల తమతో చెప్పారన్నారు. నేషనల్ ప్రాజెక్టు స్టేటస్ చేయడం లేదు అని గత ప్రభుత్వానికి కూడా తెలిపామని కేంద్ర మంత్రి తమకు వివరించారన్నారు.కృష్ణాబోర్డుకు ప్రాజెక్టులు అప్పగించడానికి ప్రభుత్వం ఒప్పుకోలేదన్నారు. బిఆర్‌ఎస్ వాళ్లు చెప్పే మాటలు అన్నీ అబద్ధాలే అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు స్టేట్‌మెంట్‌లో నిజం లేదన్నారు. కృష్ణా వాటర్ గురించి బిఆర్‌ఎస్ వాళ్లకు మాట్లాడే హక్కు లేదన్నారు.తెలంగాణకు కృష్ణా జలాల్లో తగ్గింది బిఆర్‌ఎస్ హయాంలోనే అని తెలిపారు. రాష్ట్రంలో అమూల్యమైన సంపద కెసిఆర్ పాలనలో వృథా అయిందన్నారు.కొత్త ప్రభుత్వంపైన గత ప్రభుత్వం నీటిపారుదల శాఖకు సంబంధించి 18వేల కోట్లు ఇంట్రెస్ట్ లు, 9వేల కోట్లు అన్‌ఫైల్డ్ బిల్స్ ఇరిగేషన్ లో భారం పెట్టినట్టు తెలిపారు. వేసవిలో రాష్ట్ర ప్రజలకు తాగునీటి కోసం సిఎం ఆధ్వర్యంలో కర్నాటకకు త్వరలోనే బృందం వెళ్లనుందని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.
సిఎం రేవంత్ రెడ్డికి మంత్రి ఉత్తమ్ ఫోన్…
కెఆర్‌ఎంబి వ్యవహారంపై సిఎం రేవంత్‌రెడ్డికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఫోన్‌లో చర్చలు జరిపారు. గతంలో కేఆర్‌ఎంబీ-కి ప్రభుత్వం మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు బయటపెట్టాలని సిఎం సూచించారు.మీడియా సమావేశానికి ముందు సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి ఖమ్మం జిల్లా లోని దుమ్ముగూడెం రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News