Tuesday, December 24, 2024

సంపద పెరుగుతోంది, కానీ అసమానతలూ పెరుగుతున్నాయి

- Advertisement -
- Advertisement -

భారత్ ఆర్థిక వృద్ధిని గత కొన్ని దశాబ్దాలుగా సాధిస్తోంది. ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశంగా భారత్ ఆర్థిక వృద్ధిని సాధించింది. వివరాల్లోకి వెళ్లి చూస్తే కనిపించిన దయ్యం కూడా దాని వెనుక దాగుంది. భారత్ లో అసమానతలు కూడా విపరీతంగా ఉన్నాయి. పెద్ద మొత్తంలో సంపద ఒక శాతం మంది సంపన్నుల చేతిలో ఉంది. వారి వద్ద 40.1 శాతం దేశ సంపద ఉంది. గ్లోబల్ రీసెర్చ్ సెంటర్ కు చెందిన వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ కు చెందిన నలుగురు ఆర్థికవేత్తలు ‘ఇన్కమ్ అండ్ వెల్త్ ఇనీక్వాలిటీ ఇన్ ఇండియా, 1922-2023: ది రైజ్ ఆఫ్ ది బిలియనైర్ రాజ్’ పేరిట సమర్పించిన పేపర్లో ఈ వివరాలు వెల్లడించారు. భారత్ లో ఏ మేరకు అసమానతలున్నాయో ఈ పేపర్ వెల్లడించింది. బ్రిటిష్ పాలనలో కంటే ఘోరమైన అసమానతలు ఇప్పుడున్నట్లు ఆ పేపర్ తెలిపింది. ధనవంతులు మరింత ధనవంతులవుతుండగా, పేదలు మరింత పేదలవుతున్నారని… అసమానతలు ఏయేడాదికాయేడాది పెరుగుతూ పోతోందని వెల్లడించారు. 2014-2015, 2022-2023 మధ్య అసమానతలు మరింత పెరిగిపోయినట్లు ఆ పేపర్ వెల్లడించింది.

‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ కేవలం నినాదానికే పరిమితమైంది. వికాస్ అన్నది కొద్ది మందికే దక్కింది. లక్షలాది మందిని పేదరికం నుంచి వెలుపలికి తీసుకొచ్చామంటున్నారు. అయినప్పటికీ సంపద అత్యున్నత స్థాయిలోని కొద్ది మంది వద్దే పోగవుతున్నది.

పెరుగుతున్న అసమానతలు సామాజిక విభజనను సృష్టిస్తోంది. పేద, ధనికుల మధ్య తేడా అంతకంతకూ పెరిగిపోతున్నది. ప్రభుత్వాలు నిరంకుశంగా తయారవుతున్నాయి. ఇప్పటికే దీని ఛాయలు కనపడుతున్నాయి. పన్ను వ్యవస్థను, సంపద, పంపిణీని పునర్వ్యవస్థీకరించాల్సి ఉంది. 167 సంపన్న కుటుంబాలపై 2 శాతం సూపర్ ట్యాక్స్ విధించాల్సిన అవశ్యకత ఉంది. ఆరోగ్యం, విద్య, పౌష్టికాహారం వంటి వాటిపై పెట్టుబడి పెడితే సాధారణ ప్రజలకు మేలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News