Monday, December 23, 2024

ఉగ్రకుట్ర

- Advertisement -
- Advertisement -

హర్యానాలో పట్టుబడ్డ నలుగురు ఖలిస్తానీ టెర్రరిస్టులు.. పాక్ నుంచి డ్రోన్ల ద్వారా వచ్చిన మందుగుండు
హర్యానాలోని కర్నాల్‌లో స్వాధీనం చేసుకున్న ఇన్నోవాలో 2.5కిలోల మూడు ఐఇడిలు,
ఆర్‌డిఎక్స్, పిస్టల్, 31రౌండ్ల లైవ్ కార్ట్రిడ్జ్‌లు, దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపుతున్నట్లు వెల్లడి
ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నెలకొల్పిన హర్యానా పోలీసులు

చండీగఢ్: దేశవ్యాప్తంగా భీకర పేలుళ్లు జరపడానికి ఉగ్రవాదులు ప న్నిన కుట్రను హర్యానా పోలీసులు భగ్నం చేశారు. భారీ మొత్తంలో యుధాలు, పేలుడు పదార్థాలు తెలంగాణ, మహారాష్ట్రలకు తరలించేందుకు యత్నించిన నలుగురు ఖలిస్థానీ ఉగ్రవాదులను గురువారం ఉ దయం అరెస్టు చేశారు. వీరికి పాకిస్థాన్‌లోని ఓ వ్యక్తితో సంబంధా లు ఉన్నాయని, ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఎక్కడ అందించాలో ఆ యా ప్రాంతాలను అతను యాప్‌ద్వారా వీరికి పంపించేవాడని కర్నాల్ పోలీసు సూపరింటెండెంట్ గంగారామ్ పునియా కర్నాల్‌లో విలేఖరులకు చెప్పారు.

కేంద్ర ఏజెన్సీలు అందజేసిన ఇంటెలిజన్స్ సమాచారం ఆధారంగా పంజాబ్, హర్యానా పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో వీరిని అరెస్టు చేసినట్లు హర్యానా పోలీసు డిఐజి పి కె అగర్వాల్ చెప్పారు. ఇంటెలిజన్స్ సమాచారం ఆధారంగా అంతర్రా ష్ట్ర ఆపరేషన్ చేపట్టిన పంజాబ్, హర్యానా పోలీసులు కర్నాల్ సమీపంలోని బస్తారా టోల్‌ప్లాజా వద్ద అనుమానిత ఇన్నోవా ఎస్‌యువిని గుర్తించారు. ఆ వాహనాన్ని తనిఖీ చేయగా భారీ ఎత్తున ఆయుధాలు, పే లుడు పదార్థాలు కనిపించాయి. ఇందులో కిలో ల బరువుండే మూడు ఐఇడిలు, ఆర్‌డిఎక్స్, ఒక పిస్ట ల్, 31రౌండ్ల లైవ్ కార్ట్రిడ్జ్‌లుతో పాటుగా రూ. 1.3 లక్షల నగదు స్వాధీనం  చేసుకున్నట్లు కర్నాల్ రేంజ్ పోలీసు ఐజి సతేందర్ కుమార్ గుప్తా చెప్పారు. దీం తో వాహనంలోని నలుగురినీ అరెస్టు చేశారు. పంజాబ్‌కు చెందిన ఈ నలుగురినీ ఖలిస్థానీ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నారు. వీరిని లూధియానాకు చెందిన భూపిందర్ సింగ్, ఫిరోజ్‌పూర్‌కు చెందిన గురుప్రీత్‌సింగ్, పర్మిందర్ సింగ్, అమన్‌దీప్ సింగ్‌లుగా గుర్తించినట్లు, వీరంతా తెలంగాణలోని ఆదిలాబాద్‌కు ఈ ఆయుధాలను తీసుకు వెళ్తున్నట్లు ఆయన చెప్పారు.

ఉగ్రవాద కార్యకలాపాలతో సం బంధం ఉన్న పాకిస్థాన్‌లోని హరిందర్ సింగ్ రిండా అనే వ్యక్తితో వీరంతా టచ్‌లో ఉన్నారని, డ్రోన్ల సాయంతో అత ను ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఫిరోజ్‌పూర్‌లో ముందుగా నిర్ణయించుకున్న లొకేషన్‌లో జారవిడిచే వాడ ని గుప్తా తెలిపారు. వీరిని విచారించగా అనేక విషయాలు బయటపడ్డాయనితెలుస్తోంది. ఈ ఆయుధాలను డ్రోన్ల సాయంతో దేశ సరిహద్దులనుంచి తీసుకున్నట్లు చెప్పారని, వీటిని దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నామని నిందితులు చెప్పినట్లు తెలుస్తోంది. వీరిని ముందు కోర్టులో హాజరు పరిచి కస్టడీలోకి తీసుకున్న తర్వాత లోతుగా ప్రశ్నించడం జరుగుతుందని డిజిపి అగర్వాల్ చెప్పారు.ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారని రోహ్‌టక్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. తదుపరి దర్యాప్తు కోసం హర్యానా పోలీసులు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం( సిట్)ను ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News