- Advertisement -
హైదరాబాద్: రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరిగిపోనుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాగల నాలుగు రోజులుల్లో ఎండలు మండిపోతాయని పేర్కొంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ఠంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని అరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగితా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. మధ్యాహ్నం పూట వడగాలుల తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల ప్రజలు బయటకు రావొద్దని సూచించింది. మంగళవారం నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
- Advertisement -