Sunday, December 22, 2024

ఈనెల 28న ఎంఎస్‌సి నర్సింగ్, ఎంపిటి కన్వీనర్ కోటా సీట్లకు వెబ్ కౌన్సిలింగ్

- Advertisement -
- Advertisement -

Web Counseling for MSC Nursing MPT Convenor Quota Seats
మనతెలంగాణ/హైదరాబాద్‌: ఎంఎస్సి నర్సింగ్, ఎంపిటి సీట్ల భర్తీకి ఈ నెల 23న మాప్ అప్ విడత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. గత విడత తరవాత మిగిలిపోయిన సీట్ల భర్తీకి శుక్రవారం కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనివర్సిటీ పరిధిలోని ఎంఎస్సి నర్సింగ్, ఎంపిటి కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నెల 23న ఉదయం 8 గంటల నుంచి సాయింత్రం 6 గంటల వరకు తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. సీట్ల ఖాళీల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్ సైట్ చూడవలసిందిగా యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News