Monday, December 23, 2024

నవ వరుడు మృతి కేసులో వీడిన మిస్టరీ

- Advertisement -
- Advertisement -

రాయ్ పూర్: పెళ్లికి బహుమతిగా వచ్చిన హోం థయేటర్ పేలి నవ వరుడు , అతని సోదరుడు మృతి చెందిన ఘటనలో సంచలన విషయం బయపడ్డది. చత్తీస్ గఢ్ రాష్ష్రంలోని కబీర్ ధామ్ జిల్లాలోని చమరి గ్రామానికి చెందిన హేమేంద్ర మేరవికి మార్చి 31 న ఓ యువతితో వివాహం జరిగింది. ఆ పెళ్లిలో వధువరులిద్దరికి ఓ హోం థియేటర్ బహుమతిగా వచ్చింది. అయితే ఏప్రిల్ 3 న హేమేంద్ర హోం థియేటర్ ను ఆన్ చేయగా అది పేలింది. ఈ ఘటనలో హేమేంద్ర అక్కడికక్కడే మృతి చెందగా, అతని సోదరుడు, కుటుంబ సభ్యులు గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడిన రాజ్ కుమార్ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలంలో గన్ పౌడర్ ను గుర్తించారు. దీంతో హోం థియేటర్ ఎవరు ఇచ్చారని విచారణ చేయగా వధువు మాజీ ప్రియుడు ఇచ్చినట్లు తెలిసింది. వివాహనికి ముందు వధువు, సర్జు అనే యువకునికి మధ్య ప్రేమ వ్యవహరం నడించింది. అయితే వధువు హేమేంద్రతో పెళ్లి నిశ్చయమైన తర్వాత నుంచి సర్జు ను దూరం పెట్టింది. దీంతో ఆమె పై కోపం పెంచుకున్న సర్జు కొత్త జంటను చంపేందుకు నిర్ణయించుకొని హోం థియేటర్ లో బాంబు సెట్ చేసి గిఫ్ట్ గా ఇచ్చినట్లు పోలీసులో విచారణ లో సర్జు ఒప్పుకున్నాడు. నిందితుడుని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News