Thursday, April 3, 2025

పెళ్లికి వెళ్తుండగా విషాదం.. మంటల్లో బస్సు తగలబడి ఐదుగురు సజీవదహనం(వీడియో)

- Advertisement -
- Advertisement -

పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ బస్సు మంటల్లో తగలబడి ఐదుగురు సజీవదహనమయ్యారు. ఈ విషాద సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ఘాజీపూర్ జిల్లా మర్ధా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు 50మంది మౌ జిల్ల నుంచి ప్రైవేట్ బస్సు వస్తుండగా.. మార్గ మధ్యలో హైటెన్షన్ వైర్ తగిలి మంటలు అంటుకున్నాయి. దీంతో బస్సు మొత్తం పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.

భయాందోళనకు గురై బస్సులో ఉన్నవారు వెంటనే డోర్, కిటకిల నుంచి కిందకు దిగిపోయారు. అయితే, ఐదుగురు మాత్రం మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన యూపి సిఎం యోగీ ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News