Wednesday, January 22, 2025

వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరం..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఇబ్రహీంపట్నం: వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరమని ఇబ్రహీంపట్నం సీనియర్ ప్రిన్స్‌పల్ సివిల్ జడ్జి ఇందిర అన్నారు. శనివారం వరకట్న వ్యతిరేకదినోత్సవం, జాతీయ న్యాయ దినోత్సవం పురష్కరించుకొని పెద్దతూండ్ల గ్రామంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆద్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఇందిర మాట్లాడుతూ.. సమాజంలో నేటికి వరకట్న దురాచారం ఇంకా కొనసాగుతొందన్నారు.

దీంతో మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్త్రీలలో అక్షరాస్యత శాతం పెరిగినప్పుడే వరకట్న దురాచారం నిర్మూళన సాధ్యమన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వల్లె మహిళలకు అన్ని రంగాలలో సమాన అవకాశాలు లభించాయన్నారు. ఈ కార్యాక్రమంలో భార్ అసోషియోషన్ అధ్యక్షులు మాదన్న, ప్రధాన కార్యదర్శి రవికిరణ్, న్యాయవాదులు సిహచ్. రవి, ధనుంజయ, మహెందర్, అరుణ్‌కుమార్, అంజన్‌రెడ్డి శ్రీనాథ్, గ్రామ సర్పంచ్ చిలుకల యాదగిరి గ్రామస్థులు పాల్గోన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News