Tuesday, January 21, 2025

నదిలో బోల్తా పడిన పెళ్లి వాహనం…ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

భోపాల్ : మధ్యప్రదేశ్ లోని దతియా జిల్లాలో గత రాత్రి పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రక్కు నదిలో బోల్తాపడి ముగ్గురు చిన్నారులతోసహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది గాయపడ్డారు. గత రాత్రి పెళ్లి బృందంతో వెళ్తున్న వాహనం బుహరా గ్రామం వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న నదిలోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 65 ఏళ్ల మహిళ, 18 ఏళ్ల వ్యక్తి సహా రెండు, మూడేళ్ల వయసు గల ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఘటనాస్థలం వద్ద రెస్కూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. బాధితులంతా గ్వాలియర్ లోని బిల్హేటి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఒకరి వివాహం కోసం తికమ్‌ఘర్‌కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

Also Read: ఉచిత బియ్యానికి బదులు డబ్బులు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News