Wednesday, December 25, 2024

బుధవారం మహిళలకు ప్రత్యేక సెలవు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు కానుక ఇచ్చింది. మార్చి 8న బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోడానికి రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికి స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రకటించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా విభాగం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. టిఎన్‌జిఓస్ అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News