Monday, December 23, 2024

ఎన్నికల వేళ.. పెళ్లి ముహూర్తాలు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : విజయదశమి నుంచి దాదాపు రెండు నెలలు పాటు పెళ్లి ముహూర్తాలు అధికంగా ఉండడంతో తల్లిదండ్రులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర శాసన సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో.. ఇటు రాజకీయ నాయకులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఈ కల్యాణ మండపాలను వేదికలుగా మార్చుకోనున్నారు. వచ్చే నెల (నవంబర్)లో 15, 19, 21, 22, 23, 24, 26, 29 తేదీల్లో మంచి ముహూర్తాలు న్నాయని పండితులు వెల్లడిస్తున్నారు. ఈ ముహూర్తాలలో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని పురోహితులు చెబుతున్నారు. నవంబరు 30నే పోలింగ్ కావడంతో పెళ్ళిళ్ళ హడావుడిలో ఓటు వేయడం మరిచి పోవద్దని అధికారులు ఓటర్లను కోరాల్సి వస్తోంది. ఈ నెలంతా వివాహాల జోరు కొనసాగనుంది. దీంతో ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు కలవరపడుతున్నారు. ఆశించిన మేర ముహూర్తాలు లేవు. నవంబర్ నెలలో కార్తీక మాసంలో ఎనిమిది రోజుల పాటు మంచి రోజులు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. నవం బర్ 16 నుంచి 23 మధ్యన ఎక్కువగా పెళ్లిళ్లు జరగనున్నాయి.

నవంబర్ 30న శాసనసభ ఎన్నికల పోలింగ్ ఉంటుంది. దీనికి ముందు వారం రోజుల పాటు వివాహ వేడుకలు ప్రారంభం కానున్నాయి. పోటీ చేసే అభ్యర్థుల ప్రచారం, వివాహాలు సందడి.. ఒకేసారి జరగనుండటంతో ఆయా పార్టీల నాయకులు అంతర్మధనం చెందుతున్నారు. పెళ్లిళ్ల సందడి మొదలైతే మండపాలనే ప్రచార వేదికలుగా మార్చుకోవాలనే ఆలోచనలో వివిధ పార్టీల అభ్యర్ధులు ఉన్నారు. గతంలో వివాహానికి హాజరుకావాలని కార్డు ఇచ్చినా ప్రజాప్రతినిధులు వచ్చేవారు కాదు. చాలా తక్కువ మంది మాత్రమే అది దగ్గరి వారు అయితేనే వచ్చేవారు. ఈసారి ప్రతి కల్యాణ మండపానికి వచ్చే అవకాశం ఉంది. వీలు కాకుంటే తమ కిందిస్థాయి నాయకులను పంపించి ప్రచారం చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఆడబిడ్డ పెళ్లి అయితే ఎంతో కొంత ఖర్చులకు కూడా ఇవ్వనున్నారు. ఆయా గ్రామాల్లో ఎవరెవరి పెళ్లిళ్లు ఏ రోజుల్లో జరుగుతున్నాయే గ్రామ స్థాయి నేతలు సర్వే చేసి మరి డైరీలలో రాసుకుంటున్నారు.. ఈసారి శాసనసభ ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉండటంతో ప్రతి ఓటు కీలకమేనని భావిస్తున్నారు. ఈ మేరకు పెళ్లి ఆహ్వానం పంపిన ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యమిస్తూ వివాహ వేడుకలకు హాజరైందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

నామినేషన్ల ముహూర్తంపై ఎమ్మెల్యే అభ్యర్థుల ఆసక్తి
ఎన్నికల బరిలో నిలిచే ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లు ఖా రారు అవుతుండడంతో.. టికెట్ దక్కిన వారు నామినేషన్ వేసేందుకు సమాయత్తం అవుతున్నారు. వచ్చే నెల 3 నుం చి 10వరకు నామినేషన్ ప్రక్రియ చేపట్టేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీ ల అభ్యర్థులు పండితుల వద్దకు పరుగులు పెడుతున్నా రు. ఎప్పుడు నామినేషన్ వేయమంటావ్.. మంచి ము హూర్తం చెప్పాలని పండితులను అభ్యర్థులు అడుగుతున్నారు. విజయం లభించేలా చూడాలని ఆరా తీస్తున్నా రు. వచ్చే నెల 3, 6, 9న నామినేషన్ వేసేందుకు మంచి ముహూర్తాలు ఉన్నట్లు పండితులు వెల్లడిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News