Tuesday, January 7, 2025

వార ఫలాలు(01-12-2024 నుండి 07-12-2024) వరకు

- Advertisement -
- Advertisement -

మేషం:   మేష రాశి వారికి ఈ వారం ఆర్థికంగా బాగుంటుంది. ధన లాభం సూచిస్తుంది. ఏ విధంగా చూసినా సరే మేషరాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఉద్యోగం మారాలనుకునే వారికి అనుకూలం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి ప్రకారం వీరికి మంచి ఉద్యోగం లభిస్తుందని చెప్పవచ్చు. అలాగే గృహయోగం వాహనయోగం కూడా ఉంది. మీకున్న తెలివితేటలతో వ్యాపారాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతాన పురోగతి బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం అవుతాయి. విద్యార్థినీ విద్యార్థులకు కూడా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి వీసా లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. నరదిష్టి అధికంగా ఉంటుంది. ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. కాలభైరవాష్టకం ప్రతిరోజు చదవండి. కలిసివచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే రంగు బ్లూ..

వృషభం:  వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఏ పని చేసినా వెనక్కి వెళుతుంది. ఉద్యోగంలో చిన్నపాటి చికాకులు ఎక్కువవుతాయి. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. డబ్బులు ఇచ్చే విషయంలో కానీ తీసుకున్న విషయంలో కానీ జాగ్రత్త వహించండి. వ్యాపార పరంగా అభివృద్ధి బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా, వ్యాపార పరంగా రొటేషన్సు బాగుంటాయి. సాఫ్ట్వేర్ రంగంలోని వారికి మధ్యస్థ ఫలితాలు, గృహ నిర్మాణం స్థిరాస్తి కొనుగోల వ్యవహారాలు ఈ వారం సానుకూలపడతాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది.  ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. మంగళ, శనివారం రోజున హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసివచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రే.

మిథునం: మిధున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఇంటా బయట చెప్పుకో తగిన స్థాయిలో ఇబ్బందులు ఏర్పడతాయి. వాటిని అధిగమించి మీకున్న ధైర్యంతో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడ తాయి, వాటిని అధిగమించడానికి మీరు చేసే కృషి ఎంతో ముఖ్యం. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి ఈ వారం బాగుందని క్రయవిక్రయాలు లాభసాటి గానే ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు  తొలగిపోతాయి విద్యార్థిని విద్యార్థులకు కష్టేఫలి అన్నట్టుగా ఉంటుంది. ప్రతిరోజు ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి.  కలిసి వచ్చే సంఖ్య 6, కలిసివచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు మెరూన్.

కర్కాటకం :  కర్కాటక రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా లాభసాటిగా ఉంటుంది. గడిచిన వారాల కంటే కూడా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. దానికి తగినట్టుగానే లాభాలు కూడా బాగుంటాయి. ఖర్చులు పెట్టేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరిస్తారు. సాఫ్ట్వేర్ రంగంలోని వారికి బాగుందని చెప్పవచ్చు. ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండండి. విదేశాలలో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలసి వచ్చే సంఖ్య 7 కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి.

సింహరాశి : సింహరాశిలో జన్మించిన వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆస్తి సంబంధమైన వ్యవహారాలలో ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ఇల్లు లేదా స్థలం అమ్మవలసిన పరిస్థితి గోచరిస్తుంది. అయితే అమ్మేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్లడం అనేది చెప్పదగిన సూచన. సంతానం యొక్క భవిష్యత్తు మీద దృష్టి సారించాలి. వ్యాపారపరంగా బాగుంటుంది. రొటేషన్స్ బాగుంటాయి. సాఫ్ట్వేర్ రంగంలోని వారికి, చార్టెడ్ అకౌంట్ వారికి, వస్త్ర వ్యాపారులకు ఈవారం బాగుందని చెప్పవచ్చు. సినిమా మరియు కళా రంగంలోని వారికి ఓ మోస్తారుగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా బాగుందని చెప్పవచ్చు ముఖ్యంగా విదేశాలలో ఉన్న వారికి మరింత బాగుంటుందని చెప్పవచ్చు. మీరు ఏదైతే కోరుకుంటారో అది ఈ వారం నెరవేరుతుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. వీసా గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. కలిసి వచ్చే సంఖ్య 1 కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ రాశి వారు ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవడం అనేది చెప్పదగినది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణ కోసం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేసి, సాయంత్రం పూట గణపతికి జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి.

కన్య:    కన్యా రాశి వారికి ఈ వారం బాగుంటుందని చెప్పవచ్చు. గత కొన్ని వారాల కంటే ఈ వారం మరింత బాగుంటుందని చెప్పవచ్చు. మీకున్న మేధాశక్తి, తెలివి తేటలతో ఎన్నో విజయాలు సాధిస్తారు. అందరికంటే పది అడుగులు మీరు ముందుంటారు. వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా కూడా బాగుందని చెప్పవచ్చు. కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేస్తారు. సహోదరులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వివాహాది శుభకార్యాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకుంటారు. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది.ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 8. కలిసి వచ్చే దిక్కు తూర్పు. కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ప్రతిరోజు గణపతిని గాకారక అష్టోత్తరంతో పూజించాలి. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం అరటి నార వత్తులతో దీపారాధన చేయండి.

తుల : తులా రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఉద్యోగాలపరంగా ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది కష్టపడిన దానికి ప్రతిఫలం అనేది తక్కువగా ఉంటుంది. డబ్బుకు లోటు ఉండదు కానీ ఒక రూపాయి వస్తే రెండు రూపాయలు ఖర్చు ఉంటుంది. అప్పులు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. బ్యూటీ పార్లర్ నడిపే వారికి, వైద్య వృత్తిలోని వారికి బాగుందని చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి అంతా అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు ఉద్యోగ పరంగా బాగుంటుంది ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు గడిచిన వారాల కంటే కూడా ఈ వారం వృత్తి ఉద్యోగాలపరంగా బాగుంటుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసివచ్చే రంగు బ్లూ.

వృశ్చికం:  వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగాలపరంగా ఇబ్బంది కరమైన వాతావరణం ఉంటుంది. రొటేషన్సు పర్వాలేదు అనే విధంగా ఉంటాయి.  వ్యాపార పరంగా బాగుంటుంది లాభాలు బాగుంటాయి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తారు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యక్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కూడా బాగుందని చెప్పవచ్చు. అయితే ఆరోగ్యం విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా గైనిక్ సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తున్నందువలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యం పాశుపత కంకణం కానీ రూపు కాని మెడలో ధరించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కలిసి వచ్చే సంఖ్య 5 కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే రంగు మెరూన్.

ధనస్సు:    ధనస్సు రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వ్యాపార పరంగా అభివృద్ధి బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి. నూతన వ్యాపారం ప్రారంభిస్తారు అందులో మంచి ఫలితాలు సాధిస్తారు.ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. మీకున్న తెలివితేటలతో అందరిని ఆకట్టుకొని ముందుకు సాగుతారు. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఈ వారం శుభవార్త వింటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది. కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు.

మకరం:   మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాలపరంగా ఇబ్బందికరమైన వాతావరణం ఉండదు. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కావున ఏ పని చేసినా ఫలితాలు అనేవి నిదానంగా వస్తాయి, ప్రతి పనిలో కూడా ఆచితూచి వ్యవహరించండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పక్కవారి సలహాలు తీసుకోకుండా మీకు మీరుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి జన్మించిన స్త్రీలకు ఉద్యోగ, వ్యాపార, ఆర్థికం పరంగా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. స్వగృహ నిర్మాణం అనే కళ నెరవేరుతుంది. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు విదేశీ వ్యవహారాలు అనుకూలం మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. వీసా గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం బాగుంటుంది. వైద్యం, మెకానిక్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ఈ మూడు రంగాల వారికి ఈవారం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా 9 కలిసివచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.

కుంభం:      కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోతిరిస్తున్నాయి వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి వ్యాపార పరంగా మాత్రం చిన్నపాటి నష్టాలు సూచిస్తున్నాయి. మానసిక వేదన ఎక్కువగా ఉంటుంది. వ్యాపార పరంగా ప్రతి విషయాన్ని కూడా మీకు మీరుగా ప్రత్యేకంగా చూసుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఉద్యోగ ప్రయత్నంలో ఎటువంటి లోటు లేకుండా చూసుకోండి. విదేశాలలో చదువు కోవాలనుకునే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి-వ్యాపార పరంగా అనుకున్నంత స్థాయిలో లేదు. భాగస్వామితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు బాగున్నాయి. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు బ్లూ.

­ మీనం:  మీన రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా బాగుందని చెప్పవచ్చు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు ఎంతో మేలు చేస్తాయి. వారి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ధన లాభం సూచిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు కోరుకున్న మంచి మార్పు లభిస్తుంది. వ్యాపార పరంగా రొటేషన్సు బాగుంటాయి. శని గ్రహ స్తోత్రం ఎక్కువగా పఠించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శనివారం రోజున నవగ్రహ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అన్ని రంగాలలో బాగుందని చెప్పవచ్చు. మీ జీవితాశయం నెరవేరుతుంది పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. మీరు అనుకున్న పురోగతి సాధించగలుగుతారు. విద్యార్థిని విద్యార్థులకు మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. లేదా పెద్ద వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోండి. వివాహం చేసుకునే ముందు వివాహ పొంతనలు చూసుకొని వివాహం చేసుకోవడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 5, కలిసివచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News