మేషం: మేష రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ట్రాన్స్ఫర్ లభిస్తుంది. ప్రభుత్వపరంగా ఎదుర్కొంటున్న చిన్నచిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. పై అధికారులతో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. కిందిస్థాయి ఉద్యోగులతో కూడా కలిసిమెలిసి ఉంటారు. మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి సినిమా రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు ఉన్నటువంటి స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల బాటలో ఉంటాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కాలం కలిసి వస్తుంది. అవివాహితులైన వారికి వివాహం నిశ్చయమవుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. సాహిత్య కళారంగాల్లో మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. మోకాళ్ల నొప్పులు పాదాలకు సంబంధించిన నొప్పులు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. కరుంగలి మాలను మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.
వృషభం: వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆగిపోయిన పనులు మళ్లీ మొదలవుతాయి. ఈ రాశి వారికి అన్ని విధాలుగా కాకపోయినా ప్రధానమైన విషయాలు బాగున్నాయి. ఆరోగ్యపరమైన సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. గ్యాస్ట్రిక్ అజీర్తి లివర్కు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కుటుంబ చరిత్ర గొప్పదయినంత మాత్రా నా కుటుంబంలోని వాళ్లందరూ గొప్పవాళ్లు కాకపోవచ్చునే ఈ కఠినమైన సత్యాన్ని మీరు ఈ వారం గ్రహిస్తారు. మీ మాటలతో సున్నిత మనస్కులైన వారు బాధపడి వేరుపడతారు మీరు ఎవరిని అణాలనుకున్నారో వాళ్ళని నిందించండి. సామూహిక ప్రకటన వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంది. ఉద్యోగ పరంగా ఇబ్బందికరమైన వాతావరణం ఏమీ ఉండదు. బంధుమిత్రులతో ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. సాధ్యమైనంతవరకు మౌనం పాటించండి. ఏ విషయంలో కూడా తొందరపాటు పనికిరాదు. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా బాగుంది. వ్యాపారంలో రొటేషన్సు బాగుంటాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కలిసి వస్తాయి. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. విద్యార్థిని విద్యార్థులు మెడలో మేధ దక్షిణామూర్తి రూపును ధరించండి. జీవిత భాగస్వామితో మాట పట్టింపులకు పోకుండా ముందుకు వెళ్లడం అనేది చెప్పదగిన సూచన. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న బిల్స్ ఈ వారం చేతికి అందుతాయి. ప్రతిరోజు ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసివచ్చే రంగు తెలుపు.
మిథునం: మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వ్యాపార పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి వాటిని సద్వినియోగపరచుకోండి. తల్లిదండ్రుల సహకారం ప్రోత్సాహం ఎంతగానో లభిస్తుంది. కెరియర్ పరంగా స్థిరత్వం కోసం కష్టపడతారు. వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు తరచుగా ఎదురవుతుంటాయి. ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్ర పోగలుగుతారు. కుటుంబ బాధ్యతలు ఎక్కువవుతాయి. విద్యార్థినీ విద్యార్థులు కష్టపడి చదవాల్సిన సమయం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న నూతన గృహానికి సంబంధించి బ్యాంకు లోను మంజూరు అవుతుంది. ఆరోగ్య సూత్రాలు పాటించండి. యోగా మెడిటేషన్ క్రమం తప్పకుండా చేయండి. ప్రతిరోజు కూడా హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి అలాగే హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదవండి లేదా వినండి. దీనివలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9 కలిసి వచ్చే రంగు లెమన్ ఎల్లో.
కర్కాటకం : కర్కాటక రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాలపరంగా అనుకూలమైన వాతావరణం గోచరిస్తుంది. చిన్నచిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. వీరికి అష్టమ శని కూడా పూర్తి కాబోతుంది. వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ మళ్లీ పుంజుకుంటుంది. పౌల్ట్రీ రంగానికి కాలం అనుకూలంగా లేదు. ప్రభుత్వ సంబంధమైన కాంట్రాక్టులు లీజులు మంజూరు అవుతాయి. ఎట్టి పరిస్థితిలో మధ్యవర్తి సంతకాలు చేయరాదు. అప్పు ఇవ్వడం తీసుకోవడం రెండు కూడా కలిసి రావు. రాజకీయరంగంలో ఉన్నవారు ప్రజాదరణ పొందుతారు. సహోదరీ సహోదరుల మధ్య స్థిరాస్తుల విషయంలో సఖ్యత లోపిస్తుంది. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కష్టపడి చదివితేనే మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులు కరుంగళి మాలను ధరించండి. ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగ పరంగా సహ ఉద్యోగులతో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది. పేరు ప్రఖ్యాతలు బాగున్నప్పటికీ ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది. వివాహాది శుభకార్యాల విషయంలో కొంత జాప్యం జరుగుతుంది. సంతానపరంగా అభివృద్ధి బాగుంటుంది. విదేశాలలో ఉద్యోగం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రతిరోజు ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.
సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలపరంగా ఉన్న చిన్న చిన్న ఇబ్బందులను అధిగమిస్తారు. చార్టెడ్ అకౌంటెంట్స్ వారికి లాయర్స్ కి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి , హోటల్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. ఆర్థిక విషయాలల్లో ఉన్న సంకట పరిస్థితి తొలగిపోతుంది. సాంకేతిక విద్యలు లా భిస్తాయి. మనసులో తెలియని సంతోషం గర్వం సంతృప్తి కలుగుతుంది. మోకాలు ,పాదాల నొప్పులు ఇబ్బంది పెడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. దైవదర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. కుటుంబ సంబంధమైన విషయ వ్యవహారాలు మీ అదుపులో ఉంటాయి. ఎప్పటినుండో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం ఒక మంచి సంబంధం కుదురుతుంది. ప్రతి మంగళవారం ప్రతి శనివారం రోజున ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించండి, దీనివలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వైద్య వృత్తిలో ఉన్నవారికి విదేశాలు వెళ్లాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఏ విషయంలోనైనా పెద్దలతో చర్చించి ముందుకు వెళ్లడం అనేది చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా, ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా మంచి స్థితిగోచరిస్తుంది. ఉద్యోగం మారాల్సి వస్తే ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రతిరోజు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయండి. నరదిష్టి అధికంగా ఉంది కాబట్టి కాలభైరవ రూపును మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి, కలిసి వచ్చే రంగు తెలుపు.
కన్య: కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఉద్యోగం మారడానికి కొంత సమయం పడుతుంది, దానికోసం మీరు చేసే ప్రయత్నాలు నెరవేరవు. ఆర్థిక పరిస్థితి కొంతమేరకు బాగుంటుంది. వ్యాపారంలో లాభాలు గతంలో కంటే బాగుంటాయి. ఉద్యోగ పరంగా బాధ్యతలు అధికమవుతాయి. మీకు రావాల్సిన ధనం బిల్లులు వడ్డీలు చేతికి అందుతాయి. మీ మీద వచ్చిన ఆరోపణలు, నిందలు, నిజం కావని కల్పితాలు అని రుజువు అవుతాయి. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంఘ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు బాగున్నాయి. ఫ్యాషన్ జ్యువెలర్స్ చిన్నచిన్న వ్యాపారాలు చేసే వారికి, ఫాస్ట్ ఫుడ్స్ హోటల్ వ్యాపారస్తులకు, మంచి లాభాలు ఉంటాయి. ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసే వచ్చే సంఖ్య ఏడు, కలసి వచ్చే రంగు స్కై బ్లూ.
తుల: తులా రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఎంతగానో శ్రమించి ఎన్నో బాధ్యతలను నెరవేర్చి మంచి స్థితికి వస్తారు. స్థిరాస్తుల వల్ల మానసిక ధైర్యం లాభం రెండు కలుగుతాయి. విదేశీ సంబంధమైన విషయ వ్యవహారాలు కలిసి వస్తాయి. ధైర్యం చేసి సందర్భానుసారంగా తీసుకున్న నిర్ణయాలు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో విభేదాలు జీవితంలో ఓ మలుపుగా చెప్పదగినది. ఉద్యోగంలో స్థాన చలనం, వృత్తిలో మార్పులు కొంత కాలం మీ మానసిక అలసటకు కూడా కారణమవుతుంది. స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. మీపై పిటిషన్లు విచారణలు, పెద్దగా ప్రభావం చూపించవు. క్రయవిక్రయాలలో ఆచితూచి వ్యవహరించండి. సహోదర సహోదరీ వర్గంతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు కూడా తొలగిపోతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. విద్యార్థిని విద్యార్థులు మంచి భవిష్యత్తు కోసం మీ వంతు కృషి తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. చిన్నపిల్లలను మొబైల్ కు దూరంగా ఉంచండి. ఉద్యోగ పరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి. గైనిక్ సమస్యలు లివర్ సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి. ఇంట్లో కాని వ్యాపార ప్రదేశంలో కానీ, అష్టమూలికా గుగ్గిలంతో ధూపం వేయండి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ రాశి లో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ.
వృశ్చికం: వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట మీరు ఆశించిన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. బందు వర్గంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. విందు వినోద కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు. ఉద్యోగస్తులకు ఉద్యోగ పరంగా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ అవి వారాంతంలో తొలగిపోతాయి. మీరు అనుకున్న వాటిని ఏదో రకంగా సాధిస్తారు. దాంపత్య జీవితంలో టీ కప్పులో తుఫాను వంటి సంఘటనలు ఏర్పడతాయి. అంతకుమించి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడదు. జీవితంలో ఉన్నత స్థితికి ప్రజాభిమానమే కారణం అవుతుంది. దైవానుగ్రహం కలుగుతుంది. బంధు వర్గం కన్నా బయట వారి సహాయ సహకారాలు ఎక్కువగా అందుతాయి. మీ అంచనాలు చాలా విషయాలలో నిజం అవుతాయి. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో రొటేషన్స్ మరియు లాభాలు తక్కువగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి సంబంధం కుదురుతుంది. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. కొన్ని విషయాలకు సంబంధించి అప్పు చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. లోన్ల విషయంలో క్రెడిట్ కార్డు విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. విద్యార్థిని విద్యార్థులు కష్టపడి చదవవలసిన పరిస్థితి గోచరిస్తుంది. చదువు మీద శ్రద్ధ వహించండి. దక్షిణామూర్తి రూపును మెడలో వేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. ప్రతిరోజు కూడా జిల్లేడు వత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. ఇంద్రాణి రూపును మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రే.
ధనస్సు: ధనస్సు రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. ఉద్యోగపరంగా కొన్ని మార్పులు చోటు చేసుకున్నప్పటికీ అవి మంచి ఫలితాలని ఇస్తాయి. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పరచుకోవడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి, ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ సంబంధమైన లీజులు కాంట్రాక్టులు లభిస్తాయ. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఒత్తిడికి ఎక్కువగా లోనవుతారు. ఏ విషయంలో అయినా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి. మీరు అమ్మాలనుకున్నప్పుడు తక్కువ ధర ఉంటుంది మీరు ఏదైనా కొనాలనుకుంటే ఎక్కువ ధర ఉంటుంది కాబట్టి అమ్మకాలు కొనుగోలులో కొంత నిదానంగా వ్యవహరించండి. దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. మీ అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ఏ పని చేయరు. ఆర్థికపరమైన సమస్యలు కొంతవరకు తీరుతాయి మీరు తలపెట్టిన పనులు పూర్తి చేయడానికి నిర్విరామంగా కృషి చేస్తారు. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. వాహన యోగం ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ రాశిలో జన్మించిన వారు 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. అఘోర పాశుపత హోమం చేయించండి.
మకరం: మకర రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పవచ్చు. ఏవైనా పనులు పెండింగ్ లో ఉంటే ఈ వారం పూర్తవుతాయి. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. మీ రాజకీయ పలుకుబడి ఉపయోగించి సంతానానికి ఉద్యోగం వచ్చేలా చేస్తారు. వివాహ సంబంధం విషయంలో నలుగురి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళండి. ఏదైనా ఒక పని మొదలుపెట్టినప్పుడు వెనక్కి లాగే వారు ఎక్కువగా ఉంటారు. ధనం ఖర్చు ఎక్కువగా ఉంటుంది. నలుగురిలో గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా కష్టపడతారు. నూతన అవకాశాలు కలిసి వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థినీ విద్యార్థులు ప్రతిరోజూ కూడా మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. దక్షిణామూర్తి రూపును మెడలో ధరించండి. గణపతి దగ్గర ప్రతిరోజు కూడా జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆర్థిక పరిస్థితులను ఏదో ఒక రకంగా అధిగమిస్తారు. సంఘంలో ఉన్న పెద్ద పెద్ద వారితో కొన్ని విభేదాలు ఏర్పడతాయి ఆరోగ్యం విషయంలో ఒడిదుడుకులు తప్పవు. ఉద్యోగులకు కొన్ని విషయాలలో ఎదురుదెబ్బలు తగులుతాయి. వివాదాలకు దూరంగా కుటుంబాన్ని నడిపిస్తారు. విదేశీ వ్యవహారాలు కోర్టు వ్యవహారాలు కొంతమేరకు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు స్కై బ్లూ.
కుంభం: కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి నూతన ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా కలిసి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. వివాదాస్పద అంశాలు కోర్టు వ్యవహారాలు ఓ దరికి చేరుతాయి. సంపూర్ణంగా ఆమోదయోగ్యం కాకపోయినా సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. భూమి, అపార్ట్మెంట్ కొనుగోలు వ్యవహారాలలో ఒప్పందాలు స్పష్టంగా ఉండేలా చూసుకోండి, అందరూ మనవాళ్లే అనుకుంటే మాత్రం ఇబ్బంది పడతారు. కాంట్రాక్టులు, లీజులు, ప్రింటింగ్ విషయాలు,వాహన సంబంధమైన విషయాలు వ్యాపారంలో రొటేషన్స్ సంతృప్తికరంగా ఉంటాయి ఖర్చులు అదుపు చేసి ధనం పొదుపు చేయడం ఆచరణలో సాధ్యం కాదని గ్రహిస్తారు. అనుకున్న కార్యక్రమాలు పూర్తవుతాయి. అధికారం కలిగిన పదవులకు ఎంపిక అవుతారు. జీవిత భాగస్వామితో విభేదాలు కొందరికి సంప్రాప్తిస్తాయి. విదేశీ వ్యవహారాలు వీసా కి సంబంధించి గ్రీన్ కార్డు హెచ్1బి వీసా వంటి అంశాలు సానుకూల పడతాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఈ రాశి వారు ప్రతి రోజు హనుమాన్ చాలీసా చదవడం లేదా వినడం మరియు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.
మీనం: మీనరాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలపరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ లభిస్తాయి. స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. రావలసిన ధనం చేతికి అందుతుంది. విదేశీయానం చేస్తారు. దైవదర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించి పొదుపు పైన దృష్టి పెడతారు. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కోర్టులలో , పోటీ పరీక్షలలో మీకు అనుకూలమైన విజయం లభిస్తుంది. మీకు లభించిన ప్రతి అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారు ఆరోగ్యం విషయంలో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడుతాయి కొన్ని ఆహారపు నియమాలు మార్చుకోవడం మంచిది. స్నేహితులతో భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉంది . నిరుద్యోగులు ఉద్యోగం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ విద్య కోసం విదేశాలకు వెళ్లే వారికి వీసా పాస్పోర్ట్ లభిస్తాయి కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. విలువైన ఆస్తులు కొనుగోలు చేస్తారు. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి లేదా వినండి. వృత్తి వ్యాపార పరంగా లాభాలు బాగుంటాయి. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి అఘోర పాశుపత హోమం చేయించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసే వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు.