మేషం: మేషరాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు . ఆర్థికంగా బాగుంటుంది. వృత్తి ఉద్యోగాలలో స్థిరత్వం ఏర్పడుతుంది . వ్యాపార పరంగా బాగుంటుంది. ఇంట్లో వాళ్లతో కానీ, బయట వాళ్లతో కాని, విభేదాలు వచ్చే సూచన కనిపిస్తున్నాయి జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి . ఉద్యోగస్తులకు ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉన్న స్థలం మార్పిడి సూచిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా లేదని చెప్పవచ్చు. విద్యార్థిని విద్యార్థులకు కాలం బాగుందని చెప్పవచ్చు. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. విదేశాల్లో ఉన్నవారికి, వైద్య వృత్తిలో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు . సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కొంత గడ్డు కాలమని చెప్పవచ్చు. ప్రతినిత్యం, ఉదయం సాయంత్రం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
వృషభం : వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలలో మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారంలో కూడా చిన్నపాటి నష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. నలుగురిలోను పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఉద్యోగంలో కానివ్వండి , వ్యాపారంలో కానీ ఉన్నత స్థానాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కొంత ఆలస్యం అవుతాయి. కొంత నిరాశ ని స్పృహ అనేది ఏర్పడుతుంది . కష్టానికి తగిన ప్రతిఫలం లభించట్లేదే అనే మనోవేదన ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి . భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది . విద్యలో కూడా మంచి రానింపు సాధిస్తారు . పోటీ పరీక్షల్లో ఆదర్శప్రాయంగా నిలుస్తారు. విద్యార్థిని విద్యార్థులకు చిన్నచిన్న ఇబ్బందులు ఎదురైన మంచి పురోగతి సాధిస్తారు. దుర్ వ్యసనాలకు దూరంగా ఉండడం చెప్పదగి సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
మిథునం: మిధున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి . వృత్తి ఉద్యోగాలలో బాగుంటుంది . ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులు ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ చిన్నపాటి మార్పులు వలన మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్పెక్యులేషన్స్ కి దూరంగా ఉండండి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారికి కొంత నష్టం వాటిల్లే అవకాశం గోచరిస్తుంది. పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి పెట్టండి. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది . జాతక పరిశీలన చేసుకుని ముందుకి వెళ్లడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా, వ్యాపార పరంగా , అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో కొంత విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది జాగ్రత్త వహించండి . విద్యార్థిని విద్యార్థులు కాలం అనుకూలంగా ఉంది . వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి వీసా వస్తుంది.
కర్కాటకం : కర్కాటక రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు, ముఖ్యంగా వీరికి విదేశలకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. పనులు నిదానంగా సాగుతాయి. నిరాశ పడకుండా ప్రతి పనికి అధైర్యపడవద్దు . ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి . వ్యాపార పరంగా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. సంతాన పరంగా అభివృద్ధి బాగుంటుంది . స్త్రీ సంతానం వల్ల మంచి అభివృద్ధి చెందుతారు . ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా, కష్టతరమైన వారంగా చెప్పవచ్చు . కష్టానికి తగిన ప్రతిఫలం అంత గొప్పగా లభించదు కానీ ధైర్యం మటుకు ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది . విదేశీ వ్యవహారాలు కానివ్వండి , క్రయవిక్రయాలు కానివ్వండి, పార్టనర్షిప్స్ కానీ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు.
సింహరాశి : సింహరాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు . వృత్తి ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఏ పని చేసిన నలుగురులో మంచి గుర్తింపు లభిస్తుంది. జీవిత భాగస్వామితో చిన్నపాటి మాట పట్టింపులు కూడా గోచరిస్తుంది. సంతాన వివాహ సంబంధం కోసం గట్టిగా ప్రయత్నిస్తారు . ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సినిమా పరిశ్రమ వారికి ఈ వారం బాగుంది. కళా సంస్కృతి రంగాల్లో వారికి , పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ , పూజ స్టోర్స్, చిరు వ్యాపారస్తులు ఈ వారం అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు . విద్యార్థిని విద్యార్థులకు ఈవారం బాగుంది . మీరు తలపెట్టిన ప్రతి పని0. విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కొంత ఆలస్యం అయ్యే అవకాశం గోచరిస్తుంది.ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపార పరంగా వృత్తిపరంగా అనుకూలత ఏర్పడుతుంది. విదేశాల్లో ఉన్నవారికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారు ప్రతి రోజు ఆదిత్య హృదయం పఠించడం చెప్పదగిన సూచన.
కన్య: కన్య రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి . వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి . నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు . బంధుమిత్రుల సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. మీ స్థానం నిలబెట్టుకోవడానికి మీ కృషి మీరు చేయండి . ఫలితాలు ఆ పరమేశ్వరుడుకే వదిలేయండి . విద్యార్థిని విద్యార్థులకు ఈవారం బాగుందని చెప్పవచ్చు. కెరియర్ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు . మీకున్న తెలివితేటలకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశి వారు ఎక్కువగా దైవదర్శనాలు చేసుకుంటారు దాని వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి మంగళవారం శనివారం నాడు ఆంజనేయస్వామికి ఆకు పూజ చేయించండి.
తుల: తులారాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి . వివాహం కాని వారికి వివాహ సంబంధం కుదురుతుంది . సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వాహన కొనుగోలు చేయడానికి నూతన ఇల్లు కొనడానికి మంచి సమయం . ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఉంటాయి . ఉద్యోగస్తులకు ఉద్యోగ పరంగా బాగుందని చెప్పవచ్చు. ప్రతి విషయానికి మీదే పై చేయి అవుతుంది . పేరు ప్రఖ్యాత లు లభిస్తాయి. విదేశీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికే ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి . వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వ్యాపారపరంగా బాగుంటుంది . రియల్ ఎస్టేట్ వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు . ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు బాగుంది. నలుగురితో కలిసి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి కష్టపడతారు మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారంలో వచ్చే విధంగా ఉందని చెప్పవచ్చు .విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు.
వృశ్చికం: వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ,ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాత లభిస్తాయి. కష్టపడిన దానికి ప్రతిఫలం నామమాత్రంగానే ఉంటుంది . స్నేహితులతో, బంధువులతో విరోధం వచ్చే అవకాశం కనిపిస్తోంది . ఉద్యోగంలో పెద్దగా మార్పులు ఏమీ ఉండవు . అధిక శ్రమ సూచిస్తుంది . ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి . విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ వారం అనుకూలమని చెప్పవచ్చు . వ్యాపారస్తులకు వ్యాపార పరంగా బాగుంది . మీరు అనుకున్న గుర్తింపు లభిస్తుంది నలుగురిలో మీదే పై చేయి అవ్వాలి అని చెప్పి శ్రమిస్తారు అలాగే పైచే అవుతుంది కూడా ఈ రాశి వారికి అర్థాష్టమ శని నడుస్తున్నందువలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం ఆ ఘోర పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన . రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యపరంగా ,వ్యాపార పరంగా ,ఉద్యోగ పరంగా ,బాగుందని చెప్పవచ్చు . విదేశాలకు వెళ్లాలనుకునే వారికి పోటీ పరీక్షలు రాసేవారికి కాలం అనుకూలంగా ఉంది . ఉద్యోగంలో పెద్దగా మార్పులు ఏమీ ఉండవు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. విద్యార్థిని విద్యార్థులకు కాలం బాగుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అనుకూలిస్తాయి .
ధనస్సు: ధనస్సు రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఈ వారంలో కొన్ని మిశ్రమ ఫలితాలు కొన్ని మంచి ఫలితాలు రెండు గోచరిస్తున్నాయి . మంచి ఫలితాలులో ఉద్యోగస్తులకు ప్రమోషను, అలాగే విదేశాలను వెళ్లాలి అనుకునే వారికి విదేశాలు వెళ్లడం వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణకు మంచి ఫలితాలు . వ్యాపారంలో రొటేషన్ బాగున్నాయి. ఆరోగ్య విషయంలో జీవిత భాగస్వామి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బంధుమిత్రులతో శ్రేయోభిలాషులతో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి ముఖ్యమైన సూచన . ఉద్యోగస్తులకు ఉద్యోగ పరంగా బాగుంటుంది. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అనుకోని ధనం వచ్చే అవకాశం కనిపిస్తోంది . రాదు అనుకూన ధనం వస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు బాగుందని చెప్పవచ్చు. వృత్తి వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా అనుకూల స్థితి గోచరిస్తుంది . విదేశాలకు వెళ్లాలనుకునే వారికి లేదా విదేశాల నుండి రావాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. సంతానం బాగుంటుంది వాళ్లు మంచి అభివృద్ధిలోకి వస్తారు. విద్యార్థిని విద్యార్థులకు బాగుంటుంది.
మకరం: మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కెరియర్ పరంగా ఇబ్బంది వాతావరం నెలకొంటుంది . ఉద్యోగం పోవడం , మారడం గాని సంభవిస్తుంది . ఉద్యోగ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన సమయం అని చెప్పుకోవచ్చు . జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకోని ముందుకు వెళ్ళండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపార పరంగా ఈవారం బాగుంది అని చెప్పవచ్చు . వచ్చిన ధనము ఖర్చు రెండు సమానంగానే ఉంటాయి . వ్యాపార విస్తరణం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఏ పని చేసినా చికాకు అనేది ఏర్పడుతుంది , సమయానికి ఆహారం నిద్ర అనేది ముఖ్యం. రియల్ ఎస్టేట్ రంగం వారికి కొంత నిరాశ అని చెప్పవచ్చు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి . సినిమా కళా రంగంలో వారికి బాగుందని చెప్పవచ్చు , పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు , ఉద్యోగ పరంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అధిగమించగలుగుతారు. మీరు ఏ పని తలపెట్టిన చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించిన వారికి మంచి సమయం అని చెప్పవచ్చు. విద్యార్థిని విద్యార్థులు కాలం బాగుందని చెప్పవచ్చు.
కుంభం: కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి పనిలోనూ అప్రమత్తంగా ఉండడం అవసరం . ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి . ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి . వ్యాపారం కూడా అంతంతమాత్రంగానే ఉంటుంది . ఉద్యోగ రీత్యా చిన్న చిన్న మార్పులు అనేవి ఏర్పడతాయి. ఉద్యోగంలో స్థానం మార్పిడి ఏర్పడుతోంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి . వ్యాపారంలో భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు . విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి . ఉద్యోగం మారాలనుకునే వారికి ఈ వారం అనుకూలమైన కాలమని చెప్పవచ్చు. స్నేహితులతో, బంధువులతో, భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవడం అని చెప్పదగిన సూచన. ఆరోగ్యపరమైన తగు జాగ్రత్త తీసుకోవాలి.విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు . విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి.
మీనం: మీన రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి . వృత్తి ఉద్యోగాలలో , వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటాయి. అలాగే వ్యాపార పరంగా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అనుకూలిస్తాయి. ఉద్యోగ పరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రమోషన్స్ కానివ్వండి, విదేశాలకు వెళ్లాలనుకునేవారు కానీ , విదేశీ సంబంధించిన వివరాలు కానివ్వండి, మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు , రొటేషన్స్ బాగుంటాయి , పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి ఎప్పుడు లేని విధంగా ధన సూచికం కూడా కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్, వ్యాపారస్తులకు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నవారికి కొంత ఇబ్బందికర వాతావరణం అని చెప్పవచ్చు. పెండింగ్లో ఉన్న బిల్స్ ప్రాజెక్టులు కానివ్వండి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార పరంగా ,ఉద్యోగ పరంగా బాగుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు . ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతల కోసం ఎంత కష్టపడతారో ఫలితం కూడా అంతగా లభిస్తుంది. సంతాన పరంగా బాగుంది. సంతాన అభివృద్ధి మీకు ఎంత సంతోషాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థిని విద్యార్థులకు కాలం బాగుందని చెప్పచ్చు. వైద్య వృత్తిలో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు.