Monday, December 23, 2024

వార ఫలాలు 05-11-2023 నుండి 11-11-2023 వరకు

- Advertisement -
- Advertisement -

మేషం: మేషరాశి వారికి ఈ వారం అన్ని విధముల కొంత జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు సామాన్యంగా గోచరిస్తోంది. పని చేసే చోట, కార్యాలయాలలో సానుకూలంగా ఉన్నప్పటికీ రుణముల విషయంలో అప్పులు ఇచ్చిన వారికైనా, తీసుకున్న వారికైనా ఇబ్బందులు ఏర్పడవచ్చు. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. మందకొడిగా లాభము కాదు అలాగని నష్టము కాదు అన్నట్టుగా సాగుతాయి. మీ బాధను, కష్టమును స్నేహితులే కదా అని ఎవరికీ పడితే వారికి చెప్పడం అంత మంచిది కాదు, స్నేహితులే శత్రువులు అయ్యే అవకాశములు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోండి. ఇతరుల వ్యవహారములలో సలహాలు కానీ, హామీలు కానీ మంచిది కాదు. ముత్యపు గణపతి లాకెట్ ధరించడం చెప్పదగిన సూచన.

వృషభం: వృషభరాశి వారికి ఈ వారం అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇనుము, స్టీల్, ఎలక్ట్రానిక్స్ వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, సాఫ్ట్‌వేర్ రంగం వారికి అభివృద్ధి ఉంటుంది. ప్రమోషన్లు, బదిలీలు వంటి వాటి కోసం చేసే ప్రయత్నములు మంచి ఫలితాన్ని ఇస్తాయి. విదేశీ యానమునకు చేసే ప్రయత్నములు అనుకూలిస్తాయి. వివాహ ప్రయత్నములు చేసే వారికి, గృహములో శుభకార్యములు చేయదలచిన వారి ప్రయత్నములు ఫలిస్తాయి. అనుకున్న పనిని పట్టుదలతో నెరవేరుస్తారు. వ్యాపారంలో, వ్యవహారంలో మంచి అనుకూలతని సాధించుకుంటారు. ఈ రాశి వారు ఇష్ట దైవారాధన చేయడం శ్రేయస్కరం. కాలభైరవ రూపు ధరించడం మంచిది.

మిథునం: మిథునరాశి వారికి ఈ వారం ఉద్యోగస్తులకు అధికారం, ఆర్థికాభివృద్ధి అయ్యే అవకాశములు గోచరిస్తున్నాయి. వ్యవసాయదారులకు, చేతి వృత్తులవారికి అనుకూలమైన ఫలితములు ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేయ గలుగుతారు. వ్యాపారస్తులకు అనవసరమైన శ్రమ ఎక్కువ అవుతుంది. శత్రువుల నుండి ఇబ్బందులు వచ్చే అవకాశములు ఉన్నాయి. మీ మీద లేని పోని దుష్ప్రచారములు జరిగే అవకాశములు ఉన్నాయి, ఏదైనా వ్యవహారములు విషయంలో, రహస్యములు, మీ సొంత విషయములు ఎవరికీ చెప్పడం మంచిది కాదు. ప్రతి నిత్యం ఓం నమో వెంకటేశాయ వత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం.

కర్కాటకం : కర్కాటకరాశి వారికి ఈ వారం అన్ని విధముల మిశ్రమ ఫలితములు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాలలో, స్నేహవర్గంలో కూడా సానుకూలత ఉంటుంది. మీ మాట చెలామణి అవుతుంది, దాని వలన మీలోని ఉత్సాహం రెట్టింపు అయ్యి పనులు మరింత శ్రద్ధతో పూర్తి చేస్తారు. ఆర్ధికపరమైన చిన్నచిన్న ఇబ్బందుల నుండి బయటపడతారు. వ్యాపారస్తులకు శత్రు వర్గంతో ఎదుర్కొనే సమస్యలను కూడా అధిగమిస్తారు. మీ అభివృద్ధి బాగుంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి కంటే పబ్లిసిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. లోన్లు, అప్పుల విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. 8 శని వారలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన.

సింహం: సింహరాశి వారికి ఈ వారం సర్వత్రా శుభ ఫలితాలుంటాయని చెప్పవచ్చు. ఉద్యోగపరంగా అభివృద్ధి ఉంటుంది. ప్రమోషన్లు, బదిలీలు వంటి ప్రయత్నములకు అనుకూలత ఏర్పడుతుంది. అయితే మీరు అనుకున్న పనులు పూర్తవుతూనే పనిలో ఒత్తిడి, అధికారుల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశములు ఉన్నాయి. కుటుంబపరంగా సానుకూలత ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారస్తులకు రియల్ ఎస్టేట్ రంగం వారికి మంచి ఫలితాలుంటాయి. అనుకున్న విధంగా ప్రణాళికలు చేస్తారు. అనుకోని విధంగా వచ్చే బహుమానములు చిన్నవైనా, పెద్దవైనా మీకు మరింత సంతోషాన్ని కలుగచేస్తాయి. కాలభైరవ రూపు ధరించడం శ్రేయస్కరం.

కన్య: కన్యారాశి వారికి ఈ వారం విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు, విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే వారికి, విద్య యందు భవిష్యత్తు ప్రణాళికలు చేస్తారు. విద్య యందు శ్రద్ధ, ఆసక్తి పెరుగుతుంది. పట్టుదలతో ముందుకు సాగండి, తప్పక విజయాలు వరిస్తాయి.వ్యాపారస్తులకు లేనిపోని ఆందోళనలు, టెన్షన్లు ఉండే అవకాశములు ఉన్నాయి. ఆర్ధికంగా అన్ని విధముల బాగున్నప్పటికీ చిన్న చిన్న విషయాలు మనస్సంకోచానికి కారణమవుతాయి. స్నేహితులే శత్రువులుగా మారినట్లు అనిపిస్తుంది. మరింత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ రాశి వారు కుబేర కుంకుమతో పూజచేయడం చెప్పదగిన సూచన.సుబ్రమణ్య పాశుపత కంకణం ధరించడం మంచిది.

తుల: తులారాశి వారికి ఈ వారం కొంత జాగ్రత వహించాల్సిన సమయంగా చెప్పవచ్చు. అన్ని విధములుగా మీరు అనుకున్న పనులు కొంత వాయిదా పడే అవకాశములు ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ల విషయంలో అనుకున్న సమయానికి ఫలితాలు ఉండకపోవచ్చు. శత్రువులు మీకు తెలియకుండానే మీ మీద ఉంచిన నిఘాని మీరు గుర్తించగలుగుతారు. వ్యాపారస్తులకు ఆర్ధికంగా ప్రతికూల ఫలితాలుండే అవకాశములు ఉన్నాయి. బంధువులను సైతం వ్యాపార వ్యవహారములలో నమ్మకపోవడం మంచిది. మీ పనులు కొంత శ్రమ అధికమైనప్పటికీ మీరే చేసుకోవడం మంచిది. విద్యార్థిని విద్యార్థులకు అతి నమ్మకం పనికిరాదు, కష్టపడి, ప్రణాళిక బద్ధంగా చదువుకోవడం మంచిది. సుబ్రమణ్య పాశుపత కంకణం ధరించడం మంచిది.

వృశ్చికం: వృశ్చికరాశి వారికి ఈ వారం గతంలో జరిగిన నష్టములకు కొంత ఊరట లభిస్తుంది. బంధువర్గంలో ఎలా వున్నప్పటికీ మీ కుటుంబంలో, అలాగే మిత్రవర్గములో మంచి సహాయ సహకారములు అందుతాయి. ఉద్యోగస్తులకు యధావిధిగా సామాన్యంగా గోచరిస్తుంది. చిన్నపాటి సమస్యలకు అనుమానములు పెంచుకోవద్దు. నేటి సమాజంలో ఈ జయాపజయాలు అనేవి తాత్కాలికం అనేది గుర్తు పెట్టుకోండి. కాలభైరవ రూపు ధరించడం శ్రేయస్కరం. వ్యాపారస్తులకు ఖర్చు అధికముగా గోచరిస్తోంది, జాగ్రత్త వహించాలి. శత్రువర్గం నుండి విమర్శలు, వెన్నుపోట్లు ఉండే అవకాశములు ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకు కష్టపడి చదివితే మంచి ఫలితాలుంటాయి. కుటుంబ పరంగా మంచి సపోర్ట్ లభిస్తుంది.

ధనస్సు: ధనస్సురాశి వారికి ఈ వారం మంచి అనుకూలమైన ఫలితములు ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా అభివృద్ధి బాగుంటుంది. ఆదాయం కూడా పెరిగే అవకాశములు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, సాఫ్ట్‌వేర్ రంగం వారికి అనుకూలమైన మార్పులు కనబడతాయి. సంతానపరంగా మంచి ఫలితాలు సంతోషకరమైన వార్తలు వినే అవకాశములు ఉన్నాయి. మంచి పేరుప్రతిష్టలు పెరిగే అవకాశములు ఉన్నాయి. స్థిరాస్తి వృద్ధి చేసే ఆలోచనలు ఉన్నవారికి మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. అలాగే నూతన గృహము, నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి అనుకూలత ఏర్పడుతుంది.ఈ రాశివారు శివాలయంలో అభిషేకం చేయడం చెప్పదగిన సూచన.

మకరం: మకరరాశి వారికి ఈ వారం శత్రువర్గం పట్ల జాగ్రత్త వహించి వ్యవహారములు జరిపినట్లయితే మంచి అనుకూలమైన ఫలితాలుంటాయి. కార్యాలయములలో గానీ, పని చేసే చోట గానీ ఎవరితోటి అతి స్నేహం, చనువు పనికి రాదు. ఆదాయపరంగా అభివృద్ధి ఉంటుంది. వ్యాపారస్తులకు మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం కనబడుతుంది. ఆర్ధికంగా లాభములు బాగుంటాయి. క్రమక్రమంగా అభివృద్ధి కనబడుతుంది. సాఫ్ట్‌వేర్ రంగం వారికి అనుకూలం, టెక్నికల్ రంగం వారికి కొంత ఒడిదుడుకులు ఉండవచ్చు. మనోవాంఛ సిద్ధిస్తుంది. వివాహ ప్రయత్నములు చేసే వారికి అనుకూలమైన సమయం, ప్రయత్నములు చేయండి. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. కార్యానుకూలత ఉంటుంది. కాలభైరవ రూపు ధరించడం మంచిది.

కుంభం: కుంభరాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా బాగా ఇబ్బందిపడుతున్న వారికి కొంత ఉపశమనం కలగడం అనేది జరిగే అవకాశములు ఉన్నాయి. ఉద్యోగస్తులకు సానుకూలత వున్నప్పటికీ పని ఒత్తిడి పెరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి అనుకూలమైన ఫలితములుండే అవకాశములు ఉన్నాయి. గతంలో ఉద్యోగం పోగొట్టుకుని ఉన్నవారికి కొంత రాజీపడి చేరవలసిన సమయం అని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు జరిగిన నష్టములకు కొంత భర్తీ అయ్యే అవకాశములు ఉన్నాయి. అయితే పూర్తి లాభములు ఉంటాయని చెప్పలేము. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా చేయకుండా పట్టుదలతో ముందుకు సాగండి. అనుకూలమైన ఫలితములు ఉంటాయి. 8 శనివారలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన.

మీనం: మీనరాశి వారికి ఈ వారం ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉండే అవకాశములు ఉన్నాయి. మిత్రులవలన కూడా కొంత ఇబ్బందులపాలయ్యే అవకాశములు ఉంటాయి. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు, కొంత అనారోగ్యం ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పని చేసే చోట, కార్యాలయాలలో ఉండే టెన్సన్స్ కారణంగా మీకుండే కోపమును నియంత్రించుకోండి. వారం ద్వితీయార్థంలో అనుకూలమైన ఫలితములు ఉండే అవకాశములు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కొద్దిపాటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ విజయములు తప్పక వరిస్తాయి. మీ సొంత ఆలోచనలు అనుకూలిస్తాయి. ఈ రాశి వారు శివాలయంలో అభిషేకం చేయడం అలాగే ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News