Sunday, April 6, 2025

వార ఫలాలు (06-04-2025 నుండి 12-04-2025 వరకు)

- Advertisement -
- Advertisement -

మేషం:   మేష రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. ఏలిన నాటి శని కూడా ప్రారంభమైంది. వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం మారే పరిస్థితి గోచరిస్తుంది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ లభించే పరిస్థితి కనిపిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ఏదైనా నూతన వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఆచితూచి వ్యవహరించండి. విద్యార్థినీ విద్యార్థులకు కాలం బాగుంది. బంధువులతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించండి. వివాహం కాని వారు వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు. కొంత ఆలస్యమైనప్పటికీ మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశి వారు ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం అఘోర పాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు మెరూన్.

వృషభం: వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఉద్యోగం మారడానికి ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు కూడా ఎక్కువగా చేస్తారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పర్సనల్ లోన్లకి, క్రెడిట్ కార్డుల కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సాధ్యమైనంత వరకు అప్పు తీర్చడానికి ప్రయత్నం చేయండి. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్  రంగంలో ఉన్నవారికి హోటల్ వ్యాపారస్తులకు నీళ్ల వ్యాపారానికి పాల వ్యాపారానికి మంచి లాభాలు ఉంటాయి. అప్పు ఇవ్వడం తీసుకోవడం రెండూ కలిసి రావు. వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా బాగుంటుంది. ఆరోగ్య పరంగా స్వల్పమైన ఇబ్బందులు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతాన పురోగతి బాగుంటుంది. సంతానంలో ఒకరికి ప్రభుత్వ పరంగా ఉత్తర్వులు కానీ ప్రభుత్వ ఉద్యోగం కానీ లభించే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది. కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.

మిథునం:  మిథున రాశి  వారికి ఈ వారం చాలా బాగుంది వృత్తి ఉద్యోగాల పరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఉన్నతమైన పదవి లభిస్తుంది. వ్యాపార పరంగా కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వచ్చినదనాన్ని సక్రమంగా వినియోగించుకోండి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. షేర్ మార్కెట్లో నష్టాలు సూచిస్తున్నాయి.  నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి.విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మీ కష్టానికి ప్రతిఫలం అనేది తక్కువగా ఉంటుంది.  వైద్య వృత్తిలో ఉన్న వారికి ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. దైవదర్శనాలు చేసుకోవడం వలన మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ఆహార నియమాలను జాగ్రత్తగా పాటించడం వలన ఆరోగ్యం కొంతవరకు కుదుటపడుతుంది. ప్రతి విషయంలో కూడా జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుంటారు.స్వగృహం కొనుగోలు చేయాలని మీ చిరకాల వాంఛ ఈ వారం నెరవేరుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఆరు. కలిసి వచ్చే రంగు గ్రే..

కర్కాటకం :  కర్కాటక రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు వీరికి అష్టమ శని పూర్తయింది. ఉద్యోగం మారాలి అని అనుకునే వారికి మంచి కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది.  విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా మంచి అభివృద్ధి లాభాలు బాగుంటాయి. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. సినిమా కళా రంగంలో ఉన్న వారికి కాలం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది.  ఆరోగ్యపరంగా ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఐఏఎస్ ఐపీఎస్ వంటి వాటికి ప్రిపేర్ అవుతున్న వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వివాదాలకు తగాదాలకు దూరంగా ఉండాలి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ.

సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి అష్టమ శని ప్రారంభమైంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాలపరంగా చాలా బాగుంటుంది. మంచి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగ అవకాశాలు బాగుంటాయి. వచ్చిన ధనాన్ని వచ్చినట్టుగానే ఖర్చుపెడితే భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. పొదుపు పైన దృష్టి పెట్టండి. వ్యాపారపరంగా లాభాలు బాగుంటాయి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సంబంధం కుదిరితే జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. మీరు చెప్పిన మాటలకు వక్ర మార్గాలు వెతికేవారు ఎక్కువగా ఉంటారు. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గైనిక్ సమస్యలు ఇబ్బంది పెడతాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా తీసుకోవాలి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన పెట్టుబడులు పెట్టాలనుకుంటే భూమిపైన కానీ బంగారం పైన కానీ పెట్టుబడులు పెట్టండి భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు.

కన్య:    కన్యా రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాలపరంగా బాగుందని చెప్పవచ్చు. వ్యాపార పరంగా కూడా మంచి అనుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. మీరు ఏ పని తలపెట్టిన అందులో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. కూరగాయలు అమ్మే వారికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వారికి వైద్య వృత్తిలో ఉన్న వారికి చిరు వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. సొంత నిర్ణయాలు కలిసి రావు. నూతన కాంట్రాక్టులు లీజులు లభిస్తాయి. దగ్గర వరకు వచ్చిన సంబంధాలు చేజారి పోతాయి. వివాహ విషయంలో జాతక పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఈ వారం శుభవార్త వింటారు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. క్రెడిట్ కార్డు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు కూడా దుర్గాష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా మూడు కలిసి వచ్చే రంగు ఎల్లో.

తుల: తులా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు చేపట్టిన ప్రతి పని సఫలీకృతం అవుతుంది. వ్యాపారంలో ఎప్పటినుండో నష్టాలు చూస్తున్న వారు ఈ వారం వ్యాపారంలో లాభాలను అందుకుంటారు.ఉద్యోగస్తులకు ఉద్యోగంలో చెప్పుకో దగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ ఉండవు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి  చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. విదేశాలలో ఉన్న వారికి అక్కడ విద్యను అభ్యసిస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. అప్పులు తీర్చవేయాలని ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదు. రాజకీయరంగంలో ఉన్నవారికి ప్రజాధరణ పెరుగుతుంది. ప్రతిరోజు ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు బ్లూ.

వృశ్చికం:  వృశ్చిక రాశి వారికి ఈ వారం బాగుంది. వీరికి అర్ధాష్టమ శని పూర్తయింది. ఏ పని మొదలుపెట్టిన వెనక్కి లాగే వారు ఎక్కువగా ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందులు ఏమీ ఉండవు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు నేవీ బ్లూ.

ధనస్సు:    ధనస్సు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వీరికి అర్ధాష్టమ శని ప్రారంభం అయ్యింది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి అలాగే అఘోర పాశుపత హోమం కూడా చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి.ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి అభివృద్ధి బాగుంటుంది. చార్టెడ్ అకౌంటెంట్స్ వారికి వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది.  ఆరోగ్యపరంగా గ్యాస్ట్రిక్, లివర్, గైనిక్ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.  ఆహార నియమాలు పాటించండి. ప్రయాణాలు తగ్గించండి. మిత్రుల సలహాలు సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది కానీ ధనం నిలకడ ఉండదు. విదేశాలకు వెళ్ళడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్నచిన్న ఉద్యోగాలు చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు.

మకరం:   మకర రాశి వారికి ఈ వారం బాగుంది. ఏలిన నాటి శని పూర్తి అయ్యింది. వృత్తి ఉద్యోగాలపరంగా చాలా అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది మంచి లాభాలు ఉంటాయి. మీకు మీరుగా తీసుకున్న నిర్ణయాలు లాభసాటిగా ఉంటాయి. గడిచిన వారం కంటే ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలపరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. కాంట్రాక్టులు లీజులు మొదలైనవి అనుకూలిస్తాయి. వ్యవసాయదారులకు కాలం అనుకూలంగా ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మంచి మార్కులు సంపాదించగలుగుతారు. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి.  మంచి సంబంధం కుదురుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. హెచ్ వన్ బి వీసా, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం వచ్చే అవకాశం పరిస్థితి గోచరిస్తుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతిరోజు కూడా హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.

కుంభం:      కుంభ రాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి.  మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తును నిర్దేశిస్తాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. అహంకారపూరితమైన ధోరణతో ఉండడం వలన కొంతమంది మీకు దూరం అయ్యే పరిస్థితి గోచరిస్తుంది.  సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. ఏలిన నాటి శని ప్రభావం వలన కొన్ని చికాకులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. ప్రతిరోజు శని గ్రహ స్తోత్రాన్ని పఠించండి దీని వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారస్తులకు ఖర్చులు అధికంగా సూచిస్తున్నాయి. సినిమా రంగంలో ఉన్నవారికి పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి లాయర్లకి వైద్య వృత్తిలో ఉన్న వారికి చిరు వ్యాపారస్తులకు ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి.

దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రమోషన్స్ చేతివరకు వచ్చి చేజారి పోయే పరిస్థితి గోచరిస్తుంది. కెరియర్ పరంగా బాగుంటుంది. గ్యాస్టిక్ సమస్యలు, ఎలర్జీ సమస్యలు మూత్రపిండాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. కూరగాయల వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మే వారికి లాభాలు బాగున్నాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెంచుకుంటారు. ప్రేమ వివాహం సంబంధించి ఇబ్బందులు ఏర్పడతాయి. అన్నీ నాకే తెలుసు అన్న ధోరణిని పక్కన పెట్టండి. ప్రతిరోజు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు, కలిసివచ్చే రంగు నేవీ బ్లూ.

­ మీనం: మీనరాశి  వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రస్తుతం ఏలిన నాటి శని నడుస్తుంది. స్వక్షేత్రంలో ఐదు గ్రహాలు ఉన్నాయి. దీనినే పంచగ్రహ కూటమి అంటారు. దీనికి కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా చండీ హోమం చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. మొదలుపెట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. రావలసిన ధనం సకాలంలో చేతికి అందక అప్పులు చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. సంఘంలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకోగలుగుతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు  పాటించినట్లయితే మంచి ఫలితాలు పొందగలుగుతారు. సంతానం అభివృద్ధిలోకి వస్తారు.

మీ మాటలకు వక్రభాషాలు చెప్పేవారు అధికమవుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారు ఉన్న ఉద్యోగం లోనే ఉండటం అనేది చెప్పదగిన సూచన. వ్యాపార పరంగా మీరు ఆశించిన స్థాయిలో లాభాలు లేకపోయినప్పటికీ నష్టాలు మాత్రం రావు. దైవానుగ్రహం వల్ల మీపై వచ్చిన దుష్ప్రచారాలను తిప్పి కొడతారు. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి అష్టోత్తరం చదవండి దీని ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారు ఈ వారం శుభవార్త వింటారు. నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు తెలుపు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News