Sunday, January 19, 2025

వార ఫలాలు 07-04-2024 నుండి 13-04-2024

- Advertisement -
- Advertisement -

మేషం:   మేషరాశి   వారికి ఈ వారం  మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా అమ్మకాలు, కొనుగోలు వల్ల లాభపడతారు.సంతాన పురోగతి జాగ్రత్తలు తీసుకుంటారు.స్త్రీల సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబంలో ఐకమత్యం నెలకొంటుంది. కాంట్రాక్టులు, లీజులు ఎక్స్టెన్షన్ అవుతుంది.    స్థిరాస్తుల కొనుగోలు విషయంలో జాప్యం జరుగుతుంది.  వివాహం కానివారికి వివాహం కుదురుతుంది.  సంతానం లేని వారికి సంతానప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలో సంతోషం రెట్టింపు అవుతుంది. విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు కలిసివస్తాయి. విద్యార్థిని విద్యార్థులు మేధా దక్షిణామూర్తి రూపు మేడలో ధరించండి అలాగే దక్షిణామూర్తి స్తోత్రమ్ పఠించండి.

వృషభం:  వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది.  వ్యక్తిగత సంపాదన, జీవితభాగస్వామి అదృష్టం తోడై మంచితనంతో ఆస్థి, ధనం సంపాదిస్తారు. కుటుంబ వ్యవహారాలలో కొంత అశాంతి ఏర్పడుతుంది.విద్యారంగంలో కృషి చేసే వారికి ఆ రంగంలోనే ఉద్యోగం వస్తుంది.  స్థిరాస్తుల కొనుగోలు విషయంలో జాప్యం జరుగుతుంది. అంతేకాకుండా కళా, సాహిత్యరంగాలలో, క్రీడా రంగాలలో ఉన్న కుళ్ళు రాజకీయాలను అధిగమించి, మీకు రావలసిన గుర్తింపును మీరు పొంద గలుగుతారు.  రాజకీయ రంగంలో వారికి మీ మీద వచ్చిన అపవాదులకు,   ప్రజలలో మీ మీద సాఫ్ట్‌కార్నర్‌, ఒక నమ్మకం ఏర్పడుతుంది.

మిథునం:   మిథునరాశి వారికి ఈ వారం అంత గొప్పగాను లేదు, అంత ఇబ్బంది కరంగాను లేదు అని చెప్పవచ్చు ఆర్థికపరమైన ఒత్తిడుల నుండి బయటపడతారు. రెండువైపులా వాస్తవాలు విని తెలుసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు వద్దు నష్టపోతారు.  జీవితాన్ని ఇప్పుడు చూస్తున్న కోణంలో కాకుండా మరో కోణంలో చూస్తారు.  ఎవరికి తెలియకుండా మీరు చేసే కొన్ని ప్రయత్నాలు విజయవంతమైన ఫలితాలనిస్తాయి. ముఖ్యమైన వ్యక్తుల అండదండలు లభిస్తాయి.  ఇంట్లో శుభకార్యముల ప్రస్తావన ఉంటుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.  రాజకీయ రంగంలో ఉన్న వారు రాజకీయ పరంగా మంచి అవకాశాల కోసం మీ వ్యూహం సిద్ధం చేసుకుంటారు.

కర్కాటకం :  కర్కాటకరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎంతో కాలంగా మీరు వదిలించుకు౦దామనుకున్న వ్యక్తులను ఈ వారం వదిలించుకోగలుగుతారు. ప్రతి విషయంలో ఎంతో కొంత స్వంత లాభం లేకుండా తలదూర్చరు. ఆస్తి సంబంధమైన విషయాలలో మీకు తెలియకుండా రహస్య చర్చలు జరుగుతాయి. నమ్మక ద్రోహం గురించి సమాచారం తెలిసిన వెంటనే తగు జాగ్రత్తలు తీసుకుంటారు. తనఖాలో ఉన్న డాక్యుమెంట్లను, బంగారాన్ని విడిపిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కొంత ధనాన్ని ఖర్చు పెడతారు.

 సింహం: సింహరాశి వారికి ఈవారం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వైద్య, న్యాయవాద వృత్తులలోని వారికి కాలం అనుకూలంగా ఉంది. శక్తిసామర్థ్యాలు ఉండి కూడా సరైన గుర్తింపు రాలేదన్న భావన మనోవేదనకు గురిచేస్తుంది. మీరు చెప్పిన నిజాలను ఎవరూ నమ్మరు కానీ ఇతరులు మీపై మోపిన నిందలను మాత్రం నమ్ముతారు.వ్యాపార సంబంధమైన ఋణాలు తీసుకుంటారు. శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. విదేశాలలో చేసే వ్యాపారాలు లాభాల బాటలో ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి అన్ని విధాలా రాజకీయ పరంగా బాగుంది అని చెప్పవచ్చు.

కన్య:    కన్య రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యమైన విషయాలపై దీర్ఘాలోచనలు  చేస్తారు. లోపాలు ఎక్కడున్నాయో తెలుసుకుని సరిదిద్దుకుంటారు. పాడి పరిశ్రమలో నూతన ప్రయోగాలు ఫలిస్తాయి. ఎందరికో ఉపధి కల్పిస్తారు. కుటుంబంలో ఐక్యత, ప్రశాంతత ఉన్నంత వరకు బయట అన్నివిషయాలను విజయ పథంలో నడిపించగలరు.  విలువైన భూములు, స్థలాలు  కొనుగోలు చేస్తారు. వివాదస్పద విషయాలు, కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఎదుటివాళ్ళ వ్యూహాలు గ్రహించి ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు.

తుల: తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. చాలా సందర్భాలలో మీ పొదుపు, క్రమశిక్షణ అండగా నిలుస్తాయి. పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి అనుకూలమైన కాలమని చెప్పవచ్చు.  ముఖ్యమైన ప్రయాణాలు, రహస్య ప్రయాణాలు లాభిస్తాయి. మీకు మేలు జరిగే పత్రాలు, డాక్యుమెంట్లు ఆలస్యంగా అధికారుల పరిశీలనకు వస్తాయి.  పోటీపరీక్షలకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉన్నాయి.బంధువులలో అంతర్గత రాజకీయాలు చికాకు కలిగిస్తాయి. స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు.  కుటుంబసభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.

వృశ్చికం:    వృశ్చికరాశి వారికి  ఈవారం  మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాదస్పద విషయాలకు దూరంగా ఉ౦టారు. సమస్య వస్తే పారిపోయే తత్వం ఉండదు. ప్రతిఘటన అధికంగా ఉంటుంది. సంపాదన బాగున్నా అందుకు తగిన ఖర్చులు రెడీగా ఉంటాయి.  ఆఫీస్‌కు సంబంధించిన నూతన బ్రాంచీ ఏర్పాటు చేస్తారు.
ఉద్యోగ రీత్యా బాగుంది అని చేప్పవచ్చు, నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్నమీ ఫైళ్ళపై అధికారులు సంతకం చేస్తారు.గాలిలో దీపం పెట్టి దేవునిపై భారం వేయరు. కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది.

ధనస్సు:   ధనస్సు వారికి ఈ వారం యోగదాయకంగా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి.  స్నేహితులలో సఖ్యత పెరుగుతుంది. వృథా ఖర్చులు చేయిదాటిపోతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.  మీ భాగస్వాములతో విడిపోవాలని నిర్ణయించుకుంటారు. మీ నిర్ణయాలు, ముక్కుసూటితనం, తెలివితేటలు కార్యాలయం వరకే పనిచేస్తాయి. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి.  వివాహ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.  గృహంలో శుభకార్యాల పట్ల దృష్టిసారిస్తారు.

 మకరం: మకరరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ప్రతి విషయంలో అందరూ మనల్ని అనుసరించాలని భావిస్తారు.   గ్రూప్‌ సర్వీస్‌లు, బ్యాంక్‌ ఉద్యోగాలు సాధించగలుగుతారు. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. విడాకుల కోసం అప్లై చేసుకున్న వారికి విడాకులు మంజూరు అవుతాయి.  శక్తిసామర్థ్యాలు ఉన్నవారిని పక్కనపెట్టి మీకు అనుకూలంగా ఉన్న వ్యక్తులనే ప్రోత్సహిస్తారు. వ్యాపారస్తులు  చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలం అని చెప్పవచ్చు. మీ శక్తి కొలది దానధర్మాలు చేస్తారు. విదేశాలలో ఉన్న వారికి ఈ వారం బాగుంది అని చెప్పవచ్చు.రాజకీయ రంగంలో వారికి  ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ మీ రాజకీయ ప్రవేశం ఉంటుంది. ప్రజలలో మంచి ఆదరణ లభిస్తుంది.

కుంభం:   కుంభ రాశి వారికి ఈ వారం కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. సాఫ్ట్‌వేర్‌ రంగంలోని వారికి మీ శక్తిసామర్థాలకు తగిన ఉద్యోగం లభిస్తుంది. విదేశాలలో చదువుకోవాలనే మీ కోరిక ఈ వారం తీరే అవకాశం ఉంది. కమర్షియల్‌ ఏరియాలో  ఒక ఫ్లాట్‌ని కొనుగోలు చేస్తారు. మీ కొనుగోళ్ళు అన్ని గోప్యంగా ఉంచుతారు. ఉద్యోగంలో ప్రమోషన్‌ లభిస్తుంది. విద్యార్ధిని  విద్యార్థులకు  విద్యాపరంగా బాగుంటుంది. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు.

 మీనం: మీనరాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి.  మీరు కూడా పట్టించుకోనట్లే ఉండడం మంచిది. దైవానుగ్రహం వల్ల నష్టపోయే పరిస్థితి మాత్రం రాదు.నూతన వ్యాపారాలలో ఎవరి భాగస్వామ్యం లేకుండా విజయవంతంగా ప్రారంభించి అనుకూల ఫలితాలను సాధిస్తారు. మీ మనోధైర్యం చాలా విజయాలకు కారణం అవుతుంది. భూమి సంబంధమైన విషయాలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం అనుకూలంగా ఉంది ఈవారం.  బంగారం, వెండి ధరలు ఇంకా పెరుగుతాయి.  ఉద్యోగంలో ఉన్నవారికి  స్త్రీల సహాయ సహకారాలు లభిస్తాయి. చదువు కోసం, విద్యార్థినీ విద్యార్థులకు యోగవంతమైన కాలం .

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News